ఈటలకు మరో పార్టీ ఆహ్వానం.. మనసు మార్చుకుంటారా? 

Publish Date:Jun 9, 2021

Advertisement

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో బలప్రదర్శనకు దిగిన రాజేందర్.. టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు వెళుతున్నారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటి తన పవరేంటో చూపించాలని చూస్తున్నారు. అయితే రాజేందర్ కేంద్రంగా తెలంగాణలో రసవత్తర రాజకీయం సాగుతోంది. బీజేపీలో చేరబోతున్నట్లు ఈటల సంకేతం ఇచ్చినా.. ఆయన కోసం మిగితా పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో రాజేందర్ మంతనాలు సాగించినా..  ఇప్పటికి ఆయనపై తమ వైపు వస్తారనే ఆశతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే రాజేందర్ కు మద్దతుగానే హస్తం లీడర్లు ప్రకటనలు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగానే ఈటల రాజేందర్ కు మరో పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. జూలై8న తన పార్టీని ప్రకటించనున్న వైఎస్ షర్మిల.. రాజేందర్ ను సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీలో చేరాలంటూ ఈటలకు వెల్ కం పలికారు షర్మిల. కేసులకు భయపడే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ఆమె కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని అన్నారు. ఈటల రాజేందర్ తమ పార్టీలోని వస్తానంటే ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. కరోనా విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే సరిపోయింది.. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కొనే ఉద్దేశం కేసీఆర్ లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో  రాజన్న రాజ్యమే లక్ష్యమంటున్న వైఎస్ షర్మిల.. బుధవారం లోటస్‌పాండ్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు షర్మిల దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు, ఆంక్షలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ టీపీలో కార్యకర్తలే కీలకమని.. వారికే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పార్టీలో కార్యకర్తలే కీలకం.. వారికే పెద్దపీట ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. పార్టీ ఏర్పాటుకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఆలోగా కార్యకర్తలందరూ ప్రతీ గడపకు వెళ్లి.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. ప్రతి వర్గాన్ని కలవాలని షర్మిల నిర్దేశించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించాలని స్పష్టం చేశారు.

By
en-us Political News

  
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.