మూడేళ్ల తర్వాతకూడా వై.ఎస్ పాటే..!

Publish Date:Sep 4, 2012

Advertisement

వైఎస్ చనిపోయి మూడేళ్లైంది. అయినా ఆయన అభిమానుల గుండెల్లో బతికేఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజానీకం ఇప్పటికీ వై.ఎస్ ని ప్రాణసమానంగా ఆరాధిస్తున్నారు. బతికున్నప్పుడు నోరు మెదపలేని మంత్రులు, వై.ఎస్ చనిపోయిన మూడేళ్ల తర్వాత నొప్పి మా దాకా వచ్చింది కనక కళంకమంతా ఆయనకే అంటగట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నా జనంలో మాత్రం వీసమెత్తైనా వై.ఎస్ పేరుమీద వ్యతిరేకత కనిపించడంలేదు. వై.ఎస్ ఉన్నన్నాళ్లూ రాష్ట్ర రాజకీయాన్ని శాసించారు. ఊహించని రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించి మూడేళ్లు దాటిన తర్వాతకూడా వై.ఎస్ పేరు రాష్ట్ర రాజకీయాల్ని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది.

 

వై.ఎస్ తర్వాత అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలనుకున్న జగన్ కు కాలం కలిసిరాక పోయినప్పటికీ ప్రజల్లో వై.ఎస్ మీద మెండుగా ఉన్న అభిమానం, జగన్ కి కొండంత అండగా నిలబడుతోంది. జగన్ అవినీతి ఆరోపణల్లో పీకలదాకా కూరుకుపోయుండొచ్చుగాక, కానీ.. జనానికిమాత్రం రాజన్న కొడుకన్న సానుభూతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎవరిని కదిలించినా ఎవరు తినట్లేదు చెప్పండి. ఎందుకు పెద్దాయన కొడుకుని అలా వేధించుకు తింటున్నారు కాంగ్రెసోళ్లుఅని ప్రభుత్వాన్ని తిట్టిపోయడమేతప్ప జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాళ్లే లేరు. నిజానికి అభిమానం అనే మాటని పక్కనపెడితే.. ఎవరు తినట్లేదు చెప్పండి అనే భావన ప్రజలకు కలగడం నిజంగా దురదృష్టకరమైన పరిణామమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పొట్టుపోసుకోవడంకోసమే, జల్సాలకోసమో లేక ఖర్చులకోసమో జేబులుకొట్టే చిల్లర దొంగల్ని క్షమించేసినట్టుగా లక్షలకోట్లు మింగేశాడని, మాయచేసి మతలబుచేసి రాష్ట్రాన్ని దోచుకుతిన్నాడని పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన వ్యక్తిని క్షమించగలిగే మనస్తత్వం ప్రజబాహుళ్యానికే మంచిది కాదని ప్రజస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తుల అంచనా.

 

ఏదెలాఉన్నా, జగన్ మీద ఎన్ని ఆరోపణలొచ్చినా, నిజంగా జగన్ అవినీతికి పాల్పడ్డాడని రుజువైనాసరే.. ప్రజలు మాత్రం వై.ఎస్ మీద అభిమానాన్ని జగన్ మీద కురిపించడం ఖాయమన్న విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా తేటతెల్లమయ్యింది. నిజానికి కాంగ్రెస్ అధిష్ఠానం.. జగన్ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని ఊహించనేలేదు. మొగ్గలోనే తుంచిపారేద్దామన్న రీతిలో అన్ని వైపులనుంచీ అడ్డుకట్టలు వేసి ఏమాత్రం తలెత్తడానికి వీల్లేకుండా నేరుగా పడగమీదే కొట్టే ప్రయత్నాలు చాలా జరిగినా, వై.ఎస్ ఆశీస్సులతోనే వాటన్నింటినీ తప్పించుకుని ఆయన తనయుడు నెగ్గుకు రాగలుగుతున్నాడని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోస్తున్న వాళ్లని అంతలా నెత్తికెత్తుకోవడం సరికాదని చాలా మంది బాహాటంగానే అనుకుంటున్నా.. వై.ఎస్ మీద ప్రజలు చూపిస్తున్న అభిమానాన్నిమాత్రం హర్షించకుండా ఉండలేకపోతున్నారు.  రాష్ట్రంలో ఇప్పుడు టిడిపి, కాంగ్రెస్ పార్టీలకంటే జగన్ పార్టీయే చాలా బలంగా ఉంది. అప్పట్లో జగన్ కి దూరంగా జరిగినవాళ్లుకూడా ఇప్పుడు రాసుకుపూసుకు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు.

వైయస్ చనిపోయిన మూడేళ్ల తర్వాతకూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పార్టీలన్నీ ఆయన పేరుని పలవరిస్తూనే ఉన్నాయ్. వై.ఎస్ చనిపోయాక రాష్ట్ర రాజకీయాలు పెను సంక్షోభంలో కూరుకుపోయాయన్న నిజాన్ని మాత్రం అందరూ అంగీకరించక తప్పదు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్న నమ్మకంతో కొందరుంటే, ఎలాగైనా జగన్ చేతికి అధికారం చిక్కకుండా చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగా పనిచేస్తోంది. చివరికి వై.ఎస్ దయవల్ల జగన్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి బైటినుంచి కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా నిలవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి మరి..

 

By
en-us Political News

  
కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ నుఎత్తివేయనుంది.
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు.
 అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది.  న్యూ మెక్సికో  లోని పాఠశాలలో  ఒక సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగ  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌  నేటి నుంచి  రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో ఆయన అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో  సమావేశమవుతారు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజలుగా పలు ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
తనకు రాజకీయ జీవితాన్నిఇచ్చిన ఒంగోలును వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బాలినేని కుండబద్దలు కొట్టేశారు.
 రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  మార్కాపురం తెలుగుదేశం ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు బోల్తా పడింది.
కర్ణాటక సిఎం కోసం ఢిల్లీలో కసరత్తు కర్ణాటకలో సీఎం ఎవరన్న విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్ననే హస్తిన చేరుకోగా.. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఉత్తర ప్రదేశ్ లోని కాన్ఫూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తెలంగాణలో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సనత్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.