వై.ఎస్ పాదయాత్రపై కేవీపీ డైరీకి సోనియా ఆశీస్సులు !
Publish Date:Sep 7, 2012
Advertisement
వై.ఎస్ పాదయాత్ర చేసినప్పుటి జ్ఞాపకాల్నిపదిలంగా దాచుకున్న కెవిపి రామచంద్రరావు వాటిని ఓ డైరీ రూపంలో ప్రచురించి విడుదల చేశారు. ఢిల్లీలో డైరీ విడుదల కార్యక్రమం. యూపీఏ అధినేత్రి సోనియా దీనిమీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. డైరీ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరగాలని ఆర్డర్ కూడా పాస్ చేశారు.
జగన్ మీద ఒంటికాలిమీద ఎగిరిపడుతున్న సోనియా వై.ఎస్ పాదయాత్ర డైరీని విడుదల చేయడానికి ఇష్టం చూపించడమేంటి అని చాలామంది కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. సోనియా నిర్ణయంలో వై.ఎస్ కుటుంబం పట్ల అనుసరించాల్సిన వైఖరిపై మార్పొచ్చిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.
చనిపోయిన మూడేళ్లతర్వాతకూడా ప్రజల్లో వై.ఎస్ మీద అభిమానం పిసరంతైనా తగ్గలేదన్న నిజాన్ని నిజానికి కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది. వై.ఎస్ మీదున్న అభిమానం జగన్ మీద వెల్లువలా కురుస్తోందన్న సత్యాన్నికూడా సోనియా గుర్తించడంవల్లే కెవిపీ డైరీ ప్రచురణ ప్లాన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
2104 ఎన్నికల్లో జనంలో వై.ఎస్ మీదున్న అభిమానాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవడానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయ్. ఈ బాధ్యతను ప్రత్యేకంగా కెవిపికి అప్పజెప్పారని హస్తినలో కాంగ్రెస్ వర్గాలు కోడైకూస్తున్నాయ్.
మొదట్నుంచీ వై.ఎస్ మార్క్ కాంగ్రెస్ రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్న వి.హెచ్ లాంటి సీనియర్ నేతలకు అధిష్ఠానం వైఖరి మింగుడుపడడంలేదు. మళ్లీ వై.ఎస్ కుటుంబం ఇందిరకుటుంబానికి దగ్గరకావడాన్ని కొందరు సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
కెవిపి డైరీ విడుదల కార్యక్రమానికి హాజరుకావొద్దంటూ పార్టీలో కొందరు సీనియర్లు అంతర్గతంగా ఒకళ్లకొకళ్లు సందేశాలుకూడా పంపించుకున్నారు. నిజానికి వీళ్లంతా వచ్చినా రాకపోయినా పెద్దగా పట్టించుకునేవాళ్లుకూడా ఎవరూ లేరు. ఎందుకంటే డైరీ విడుదల కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్ఠాన దేవత సోనియా ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయ్ మరి..
http://www.teluguone.com/news/content/ys-padayatra-31-17186.html





