నారా లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు
Publish Date:Sep 7, 2012
Advertisement
ఎన్నికల గడువు దగ్గరికి వస్తుండడంతో టిడిపి అధినేత చంద్రబాబు అక్టోబర్ 2 నుండి రైతుబాట పాదయాత్రకు రెడీ అవుతున్నారు. దాదాపు నాలుగు నెలలు పార్టీ కార్యాలయానికి దూరమవుతున్నారు. దీంతో టిడిపి ఆఫీస్ బాధ్యతలను నారా లోకేష్ కి అప్పగించడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని సమాచారం. లోకేష్ కోసం ఎన్టీఆర్ భవనంలో ప్రత్యేక చాంబర్‌ను తయారు చేస్తున్నారట. మొదటి అంతస్తులో గతంలో చంద్రబాబు ఉపయోగించిన చాంబర్‌ను ఆయన కోసం రెడీ చేస్తున్నారని సమాచారం. అయితే సాదారణ కార్యకర్తగా కాకుండా, ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే బాగుంటుందని, టిడిపి కార్యకర్తల సూచనల మేరకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఆల్ రెడీ నారా లోకేష్ పార్టీలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ఉండటంతో టిడిపి ఆఫీస్ పనులన్నీ నారా లోకేష్ చుస్తున్నాడట. టిడిపి నేతలతో మాట్లాడటం, కార్యకర్తలు వస్తే వారి సమస్యలు తెలుసుకోవటం, పార్టీలో ఉండే సమస్యలపై దృష్టి పట్టాడు. నియోజకవర్గాల వారిగా టిడిపి బాలాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే నారా లోకేష్ రాజకీయాలలోకి రావటానికి ఇదే సరియైన సమాయమని కార్యకర్తలు బావిస్తున్నారట.
http://www.teluguone.com/news/content/lokesh-nara-31-17185.html





