Publish Date:Jan 17, 2025
చెప్పేటందుకే నీతులు అన్న విషయాన్ని బీజేపీ మరోమారు రుజువు చేసింది. పలు సందర్భాలలో ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత హామీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల వేళ విజయం కోసం ఉచితాలపైనే ఆధారపడ్డారు.
Publish Date:Jan 17, 2025
ఫిరోజ్ వ్యసనాలను అలవాటు పడ్డాడు. తాను మనసులో ఏది తల్చుకుంటే అది నిమిషాల్లో కావాలంటాడు. తల్లి దండ్రులకు ఇది నచ్చలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఒక రోజు ఫిరోజ్ ను తీసుకుని తల్లిదండ్రులు మౌలానా దగ్గరకు వచ్చారు.
Publish Date:Jan 17, 2025
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కేనని కేంద్రం విస్పష్టంగా చాటింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గింది. విశాఖ ఉక్కును నష్టాల నుంచి బయటపడేయడానికి 11 వేల 440 కోట్ల రూపాయల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది.
Publish Date:Jan 17, 2025
తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులకు శిక్ష పడే విషయంలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్వయంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టే విషయంలో పోలీసులు గట్టిగా ప్రయత్నించడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రఘురామ కృష్ణం రాజు.. ఈ కేసులో స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
Publish Date:Jan 17, 2025
రైజింగ్ తెలంగాణ అజెండాగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలుత ఆయన సింగపూర్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల సింగపూర్ పర్యటన తరువాత ఆయన దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరౌతారు.
Publish Date:Jan 17, 2025
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మంత్రులు లోకేష్, టీజీ భరత్ , ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సిఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనాథ్ బండారు, ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో సాయికాంత్ వర్మ సిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మాట్ దావోస్ లో పర్యటించనున్నారు.
Publish Date:Jan 17, 2025
తన విధులకు ఆటంకం కలిగించినట్టు గత నెలలో బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.
Publish Date:Jan 17, 2025
గురు శిష్యులుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.
Publish Date:Jan 17, 2025
పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశ విదేశాంగమంత్రి బాలకృష్ణన్ తో శుక్రవారం భేటీ అయ్యారు.
Publish Date:Jan 17, 2025
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కడం ప్రభుత్వ ప్రతిష్ఠను సైతం మసకబారుస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
Publish Date:Jan 17, 2025
ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోతే రైతుపడే ఆవేదన మాటల్లో వర్ణించలేం.వాణిజ్య పంటలయితే లక్షల్లో నష్టం వస్తుంది.గత రెండేళ్లుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసి చూసి విసిగి వేశారిపోయారు.
Publish Date:Jan 17, 2025
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్ లో విచారిస్తున్నారు.
Publish Date:Jan 17, 2025
లొట్టపీసు కేసు, లైడిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, ఏసీబీ, ఈడీలు ఈ కేసులో నన్నేం పీకలేవు అంటూ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ ఫార్ములా రేస్ కేసులో బాగానే ఇరుక్కున్నారు.