జగన్ హైదరాబాద్ పర్యటన.. స్వాగత ఫ్లెక్సీలపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు.!

Publish Date:Aug 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  వైసీపీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో   ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సందర్భంగా  ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు   హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ జగన్ ఏదో బీఆర్ఎస్ నాయకుడా అన్నట్లుగా ఆ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉన్నాయి.  ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.

గతంలో వైసీపీ, బీఆర్ఎస్  మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యం దృష్ట్యా ఇప్పుడీ పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, పొలిటికల్ చర్చకు తెరలేపాయి.  జగన్ పర్యటనలూ ర్యాలీలలో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు.. తెలంగాణలో వైసీపీ, బీఆర్ఎస్ ల పొత్తకు సంకేతాలా అన్న చర్చకు తెరలేచింది.

తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, వైసీపీల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఏదైనా కుదిరిందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే తెలంగాణ స్థానిక పోరులో  ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలంటే.. అందుకు జనసేన రంగంలో ఉండటం ఒక విధంగా జనసేన పోటీ బీఆర్ఎస్  విజయావకాశాలకు గండి కొట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.

జీహెచ్ఎంసీ పరిధిలో ఏపీకి చెందిన వారు జనసేన వైపు మొగ్గు చూపుతారనీ, అలా జరగకుండా అడ్డుకోవాలంటే..జగన్ సహకారం అవసరమనీ బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉండటంతో రానున్న రోజులలో వైసీపీ, బీఆర్ఎస్ పోత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్వర్యం లేదని అంటున్నారు. 

YS Jagan Hyderabad Visit, BRS YSRCP Flexis Begumpet, Jagan Jalavihar Wedding Visit, Telangana Politics Updates, KCR KTR YS Jagan Cutouts

By
en-us Political News

  
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.