ఏపీ సీఎం జగన్ మామగారైన డాక్టర్ గంగిరెడ్డి మృతి
Publish Date:Oct 2, 2020
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జగన్ మామగారు, ఆయన భార్య భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయన శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం పులివెందులకు తీసుకురానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు. సీఎం జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-father-in-law-gangi-reddy-dies-39-104710.html
http://www.teluguone.com/news/content/ys-jagan-father-in-law-gangi-reddy-dies-39-104710.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





