Publish Date:Jul 20, 2025
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కాంలో రింగ్ మాస్టర్‌లా వ్యవహరించి అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో మిథున్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా మిథున్‌రెడ్డిని పేర్కొన్నారు.
మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్థారించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్‌కు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారని సిట్ అధికారులు అభియోగం మోపారు. యావత్తు లిక్కర్ కుట్ర అమలుకు సత్యప్రసాద్‌ను ఉపయోగించారని తెలిపారు. బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని, లిక్కర్ స్కాంలో లోతైన కుట్ర దాగి ఉందని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు వివరించారు.
ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్‌లోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్ వ్యక్తులు, ఉన్నతాధికారులు రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అరెస్టయిన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా.. అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు సిట్ అధికారులు.మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో.. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్ అధికారులు తెలిపారు.
మరింత దర్యాప్తు కోసం మిథున్‌రెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్‌రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్‌రెడ్డి సహకరించలేదని గుర్తుచేశారు. నిందితుడు మిథున్‌రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ, కమీషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-39-202343.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.