అతి సర్వత్రా జగనేత్!

Publish Date:Jul 6, 2025

Advertisement

 

క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.. శ్రీమాన్ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనుల వారు.మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ అభ్యర్ధుల జీవితాలను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టిన జగనన్న తాజాగా.. ముందస్తు ఎన్నికల్లాగా- ముందస్తు అభ్యర్ధుల ఖరారు ప్రకటనలు చేస్తున్నారట. ఇప్పటికి ఓకే అయిన వాటిలో మచ్చుకు కొన్ని పేర్లు.. ఎవరివీ, ఏంటని చూస్తే వాటిలో తొలిపేరు సర్వేపల్లి నుంచి- కాకాణి గోవర్ధన రెడ్డిదేనట. ఇక వరుసగా చూస్తే.. నరసన్న పేట- ధర్మాన కృష్ణదాస్, గననవరం- నుంచి వల్లభనేని వంశి, మచిలీపట్నం- నుంచి పేర్ని నాని, గుడివాడ- నుంచి కొడాలి నాని, దెందలూరు- నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ- నుంచి 

నందిగం సురేష్, మాచర్ల- నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరి పేట- నుంచి విడదల రజనీ, తాడిపత్రి- నుంచి పెద్దారెడ్డి, రాఫ్తాడు- నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం- నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పాతపట్నం- నుంచి రెడ్డి శాంతి.. ఇలా ఒక లిస్ట్ అప్పుడే లీక్ చేశారట. అంటే గతంలోలా పార్టీకి డిమాండ్ లేక పోవడం.. దానికి తోడు కేడర్ కూడా తీవ్ర నిరాశా నిస్పృహలకు లోను కావడంతో ఒక బూస్టింగా ఉంటుంది లెమ్మని జగన్ సార్ ఈ తరహాలో ముందుకెళ్తున్నట్టు తాజా కబర్. ఒక సమయంలో ఎమ్మెల్యేలను కలవడానికే అపాయింట్లు ఇవ్వని.. ఒక వేళ ఇచ్చినా వారిని నిలబెట్టే మాట్లాడే కల్చర్ గల జగనన్న.. ఇటీవల నేనూ మారాను బాస్! అని తెలియ చెప్పడంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ అనౌన్స్ మెంట్స్ ఒక పాలసీగా తీసుకున్నట్టు సమాచార్.

రేపటికి రెడ్డెవరో- రాజెవరో అన్నది పాత నాటు సామెత. కానీ ఆ రేపటి ని కూడా ఇప్పటి నుంచే మార్చేసి.. తనకు తాను ఎప్పటిలాగానే అధినాయకుడిలా కాకుండా 'అతి'నాయకుడిలా వ్యవహరిస్తున్నారట జగన్. దానికి తోడు ఇప్పటికే ఈ అతి మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాటలను బట్టీ చెబితే.. ఈ వైనాట్ 175 వంటి టూ మచ్ స్లోగన్స్ ఎవరి ఐడియాలో తెలియవు కానీ, ఇవన్నీ పార్టీని నిలువునా ముంచాయని అంటారాయన. దీంతో సామాన్యంగా వ్యవహరించాల్సిన జగన్ అత్యుత్సాహం కొద్దీ ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీ మైలేజ్ మరింత డ్యామేజ్ గా మారుతున్నట్టు సమాచారం. 

మరి చూడాలి. జగన్ సార్ ఇదే ఫ్లో మెయిన్ టైన్ చేసి. ఆ పదకొండు కూడా పోగొట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉందంటున్నాయి.. పార్టీ శ్రేణులు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఎన్నికలు వచ్చినట్లు నాలుగు ఏళ్ల ముందే ఊహించడం, తామే గెలుస్తామ‌ని క‌ల‌లు క‌న‌డం.. ఆ ఊహ‌ల్లో తేలియాడ‌టం.. అలా బతికేయడాన్ని ఏమనుకోవాలి? మానసిక సమస్యా.. లేక వేరే వ్యూహమా? నేతల్ని, కార్యకర్తలను తనతో నిలుపుకోవడం లో భాగమా? అన్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జ‌గ‌న్  చేసిన ప్ర‌తి ఓవ‌రాక్ష‌న్ బెడిసికొట్ట‌డంతో.. ఇలాంటి విష‌యాల‌ను పార్టీలో కొంద‌రు బాహ‌టంగానే వ్య‌తిరేకిస్తున్నార‌ట‌.

By
en-us Political News

  
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన మహ్మద్‌ సిరాజ్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు.
ఉక్కు పరిశ్రమ వ్యర్థాలను సంపదగా మలచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది.
చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
కాళేశ్వరం కమిషన్‌ నివేదికను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదికకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్‌ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.