మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
Publish Date:Jul 20, 2025
.webp)
Advertisement
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఆయను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మద్యం పాలసీ రూపకల్పన, కుంభకోణంలో ఆయన కీలకమని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లి పలు ఆధారాలు సమర్పించింది. మిథున్‌ను విచారించాల్సి ఉందని రిమాండ్ కోరగా కోర్టు అంగీకరించింది. ఈ కేసులో మిథున్‌రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.
అంతకు ముందు వాదనల సందర్భంగా తనను నెల్లూరు జైలు కు పంపించాలని మిథున్‌రెడ్డి కోర్టుకు అభ్యర్థించారు. తనకు వై ఫ్లస్ సెక్యూరిటీ ఉందని తనకు బ్లడ్ క్లాట్స్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ, అవసరాన్ని బట్టి హాస్పిటల్ లో చికిత్స సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. 409 సెక్షన్ వర్తించదని మిథున్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందనీ కోర్టు కు తెలిపిన సిట్ తరపు లాయర్.
మిథున్ రెడ్డి అరెస్ట్ అవసరానికి సంబంధించి 29 కారణాలను కోర్టుకు చూపించిన సిట్ తరపు న్యాయవాదులు. చివరికి సిట్ న్యాయవాదుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సెక్షన్ 409, 420, 120 (B), రెడ్‌విత్ 34,37, ప్రివెన్షన్ ఆప్ కరరెప్షన్ యాక్టు 7,7ఏ, 8, 13(1)(B), 13(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.కాసేపట్లో మిథున్‌రెడ్డిని రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించనున్నారు.
http://www.teluguone.com/news/content/ys-jagan-39-202346.html












