గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన వ్యక్తిని పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతిస్తున్నారని దళిత, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఐతా నగర్‌లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్లబెలూన్లతో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జగన్‌కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. జగన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా దళిత, ప్రజా సంఘాలు నిర్వహించిన రాస్తారోకో, మానవహారం జగన్ అహంకారానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని ప్రతిబింబించాయి. "రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తున్నారా? నూతక్కి కిరణ్ హత్యపై మీకు పరామర్శ ఎందుకు లేదు?" అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. నాలుగేళ్లు గడిచినా, నూతక్కి కిరణ్ మృతదేహం లభ్యం కాక, అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా, జగన్ రెడ్డికి వారి ఆవేదన కనిపించలేదా? ఒక యువకుడి జీవితం అంధకారంలోకి నెట్టబడినప్పుడు, ఆ కుటుంబానికి న్యాయం జరగనప్పుడు, మాజీ ముఖ్యమంత్రిగా మీరు రౌడీ షీటర్లను పరామర్శించడం దారుణం కాదా? ప్రశ్నించారు.
తెనాలిలో సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, గంజాయి విక్రయాలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, తెనాలిలో దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసులు ఇటీవల దాడి చేశారన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏప్రిల్ 25న తెనాలిలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ యువకులు దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారని తెలుస్తోంది. గంజాయి కలిగి ఉన్నారనే అనుమానంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌తో ఈ యువకులకు వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు వారిని కింద కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మే 26న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-25-199205.html
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.