జగన్ 5వ రోజు దీక్ష.. సైలెంట్ గా ఏపీ ప్రభుత్వం
Publish Date:Oct 11, 2015
Advertisement
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు సమీపంలో నల్లపాటు వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ దీక్షకు ఇతర పార్టీనేతల దగ్గర నుండి ప్రజాసంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఒక్క ఆంధ్రాలోనే కాదు హైదరాబాద్ లో ఉన్న ఏపీ విద్యార్ధులు కూడా జగన్ దీక్షకు మద్దతు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని.. నూతన రాష్ట్రం.. అందున నూతన రాజధానిలో ఎన్నో నిర్మించాల్సి ఉంటుంది.. అంలాటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని జగన్ కు మద్దతివ్వాలని.. జగన్ ఇప్పటి వరకూ ఏం చేసినా విజయం సాధించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా విజయం సాధిస్తారని అన్నారు. ఇదిలా ఉండగా జగన్ దీక్ష ఈ రోజుతో 5వ రోజుకు చేరింది. దీంతో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని.. జగన్ బరువు తగ్గి, నీరసించారని.. షుగర్ లెవల్స్ పడిపోయాయన్నారు. బీపీ 110/70గా ఉందని, పల్స్ రేట్ 66 ఉందని చెప్పారు. అసలు నిన్న రాత్రే జగన్ తో దీక్షను విరమించాలని అనుకున్నా జగన్ దానికి అంగీకరించక ఈరోజు కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు జగన్ దీక్షపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కాస్త టెన్షన్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ దీక్ష ప్రారంభించిన రెండు రోజులు విమర్శలు చేసినా ఇప్పుడు మాత్రం చాలా సెలెంట్ గా ఉంటూ జగన్ దీక్ష గురించిన వివరాలు సేకరించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ దీక్షతో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ఆసక్తికరంగా మారింది. జగన్ కూడా చాలా మొండిగా దీక్ష చేస్తూ అందరి మద్దతు ఇవ్వడం చూస్తే ఒక రకంగా ఈ దీక్ష వల్ల జగన్ కు కొంత మేలు జరిగినట్టే కనిపిస్తుంది.
http://www.teluguone.com/news/content/ys-jagan-39-51085.html





