మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం : లోకేష్

Publish Date:Jun 7, 2025

Advertisement

 

వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియాలో అవమానించవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు. 

ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి లోకేష్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అని లోకేష్ తెలిపారు. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని  ముఖ్యమంత్రి చంద్రబాబు  పదేపదే హెచ్చరిస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని లోకేష్ హెచ్చరించారు.

 మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్   బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్‌ పనిపడుతుందని లోకేష్ తెలిపారు.

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు.
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
పూర్ణ‌చంద్ర‌రావు అనే ఒక వ్య‌క్తితో యాంక‌ర్ స్వేచ్ఛ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో కూడా ఆమె ఒక‌రితో వివాహం అయ్యి త‌ర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో ప‌ని చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు.
ఆస్కార్ క‌మిటీలో చోటు ద‌క్కింది. అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుద‌ల చేసిన స‌భ్యుల జాబితాలో క‌మ‌ల్ పేరు కూడా ఉంది. ఎంతో మంది హాలీవుడ్ న‌టీన‌టుల‌తో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పాలుపంచుకోనున్నారు క‌మ‌ల్.
జులై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు కమలం పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుండగా, ఎల్లుండి సోమవారం నామినేషన్ల స్వీకరిస్తారని సమాచారం.
ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత సహాయకుడికు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు కవిత పీఎను విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది.
జగన్ లో అరెస్టు భయం పీక్స్ కు చేరింది. జగన్ రెంటపాళ్ల పర్యటలో ఆయన కారు కింద పడి వైసీపీ కార్యకర్త మరణించిన సంఘటనపై జగన్ ఏ2గా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. విచారణను జులై 1కి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణను వాయిదా వేస్తూ జులై 1 వరకూ జగన్ పై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆశ్రయించింది.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్  శుక్రవారం (జూన్ 27) తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వైసీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం (జూన్ 27) గుడివాడకు వచ్చా రు . గత ఏడాది జరిగిన ఎన్ని కలలో పరాజయం తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్ననాని అకస్మాత్తుగా గుడివాడకు ఎందుకు వచ్చారంటే ఓ కేసులో నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.