జ‌గ‌న్‌కి ఇంత ప‌బ్లిక్..ఎలా వ‌స్తారో మీకు తెలుసా?

Publish Date:Jul 13, 2025

Advertisement

 

జ‌గ‌న్ చుట్టూ ఇంత మంది జ‌నం.. రియ‌లా ఫేకా? అస‌లేంటీ పొలిటిక‌ల్ ప‌బ్లిక్ స్టోరీ? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశం. బేసిగ్గా జ‌గ‌న్ కి బీసీ-ఎస్సీ-ఎస్టీ- ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీల్లో ఓటు బ్యాంకు ఉన్న మాట నిజం. ఆ సాలీడ్ ఓటు బ్యాంకే మొన్న‌టి ఎన్నిక‌ల్లో 39 శాతం ఓట్లు ప‌డేలా చేసింది. ఈ ఓటర్లు నిజానికైతే.. అంత ఫ్రీగా దొరికే వారు కాదు. ఎందుకంటే వీరు దైనంద‌ని జీవితాల్లో య‌మ బిజీగా ఉంటారు. కార‌ణ‌మేంటంటే వారు నిత్యం ఏదో ఒక ప‌నీ పాట చేసుకోకుంటే పూట గ‌డ‌వ‌దు. ఒక ర‌కంగా  చెబితే రెక్కాడితే గానీ డొక్కాడ‌దు. అలాంటి  జ‌నం జ‌గ‌న్ రావ‌డంతోటే ఇంత‌గా రోడ్డెక్క‌తారా? ఒక సినిమా న‌టుడికి మ‌ల్లే ఇంత‌గా పిచ్చెక్కి ఆయ‌నపై ఎగ‌బ‌డ‌తారా? అన్న‌దొక స‌స్పెన్స్. అయితే ఇక్క‌డే కొంద‌రికి ఒక‌ డౌట్ వ‌స్తోంది. కార‌ణ‌మేంటంటే.. ఇదంత ఒరిజిన‌ల్ ఫ్యాన్ బేస్ కాద‌న్న‌ది ఒక అంచ‌నా. కార‌ణం మ‌నం ఇందాకే మాట్లాడుకున్నాం. జ‌గ‌న్ కి ఉన్న ఓటు బ్యాంకు ఎలాంటిదో గుర్తు చేసుకున్నాం. వారంత తీరిగ్గా.. ఇలాంటి రాజ‌కీయ దండ‌యాత్ర‌ల‌కు రారు.

 

ఒక వేళ‌ వ‌స్తే.. ఇంట్లో పొయ్యిలో పిల్లి ఆ రోజంతా అలాగే నిద్ర పోయే ప‌రిస్థితి.మ‌రి వీరంతా ఎవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌స్తున్నారు? వీరికేం ప‌నీ పాటా లేదా? అంటే ఇక్క‌డ కూడా మ‌నకొక ఉదాహ‌ర‌ణ దొరుకుతుంది. తాజాగా పేర్ని  నాని ఒక వీడియో లీక్ అయ్యింది. ఆయ‌న జ‌నాన్ని ఎలా పుర‌మాయిస్తారో అన్న విష‌యం పిచ్చ క్లారిటీతో ఈ వీడియోలో మ‌న‌కు క‌నిపిస్తుంది. అంతే కాదు గ‌తంలో జ‌గ‌న్ అధికారంలో ఉండ‌గా.. ఆయ‌న ప్రోగ్రామ్స్ కి ఏ టూ జెడ్ స‌ర్వీస్ అందించే వారున్నారు. ఈ బాధ్య‌త‌ల‌న్నిటినీ త‌ల‌శిల ర‌ఘురామ్ చూసుకునే వార‌ని చెబుతారు. ఇక స్క్రిప్టింగ్ కి ఒక టీమ్ ఇలా.. జ‌గ‌న్ త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీలో ఇలాంటి వంధిమాగ‌ధులను పుష్క‌లంగా నియ‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. వీరంద‌రికీ అధినాయ‌క‌త్వం పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌హించ‌గా.. ఆయ‌న కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేస్తుంటారట‌.

జ‌గ‌న్ చుట్టూ ఇంత కోట‌రీ వ‌ర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కోట‌రీ ప‌న‌ల్లా ఏంటంటే.. జ‌గ‌న్ ఎ క్క‌డికి వ‌స్తే అక్క‌డికి జ‌నాన్ని తోల‌డం. ఆయా ఏర్పాట్లు చేయ‌డం. మొన్న‌టికి మొన్న బంగారు పాళ్యం మామిడి కాయ‌ల వ్య‌వ‌హారం చూసే ఉంటాం. త‌న ప‌ల్నాడు ప‌ర్య‌ట‌న‌లో ఏ విధంగా.. త‌ల‌కాయ‌ను త‌న కారు టైర్ల కింద వేసి తొక్కించాడో స‌రిగ్గా అలాగే.. మామిడికాయ‌ల‌ను కూడా  ర‌ప్పా ర‌ప్పా వేసి తొక్కించిన దృశ్యాల‌ను చూసే ఉంటాం.ఇవేవీ యాధృచ్చికంగా జ‌రుగుతున్న‌వి కావంటారు. వీట‌న్నిటి వెన‌క అతి పెద్ద నెట్ వ‌ర్క్ ప‌ని చేస్తూ ఉంటుంది. జ‌గ‌న్ ప‌ని అయిపోయింది. ఈసారి ఆ ప‌ద‌కొండు సీట్లు కూడా రావు. ఇక ఆయ‌న్ను భారీ ఎత్తున లీడ‌ర్లు కూడా వ‌దిలేస్తున్నారు.. అన్న కామెంట్ వినిపించిన‌పుడ‌ల్లా.. ఈ నెట్ వ‌ర్క్ అమాంతం ఉలిక్కి ప‌డుతుంది. జ‌గ‌న్ ఇమేజీని పెద్ద ఎత్తున‌ జాకీలేసి లేప‌డానికి.. వీరంతా కూడ‌బ‌లుక్కుంటారు. జూమ్ మీట‌టింగులు చేసుకుంటారు. కాన్ఫ‌రెన్స్ కాల్స్ మాట్లాడుకుంటారు.. అంతే ఒక ప్ర‌ణాళిక సిద్ధం చేసి జ‌గ‌న్ కి అప్ డేట్ చేస్తారు.

అన్నా అక్క‌డ మ‌న గంజాయ్ బ్యాచ్ అరెస్ట‌య్యింది. వాళ్లంతా మ‌నం స‌ర‌ఫ‌రా చేసిన గంజాయ్ తీస్కునే ఇలా త‌యార‌య్యారు. అలాంటి వాళ్లు అరెస్ట‌యితే ఓదార్చాల్సింది మ‌న‌మే అని అలెర్ట్ చేస్తారు. ఎప్పుడో గ‌త ఏడాది చ‌నిపోయిన నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు విగ్ర‌హం పెట్ట‌డానికి చందాలిచ్చాం. మీరొస్తే బాగుంటుంది.. అని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. అలా అలా ఈ నెట్ వ‌ర్క్ ఒక ప‌ద్ధ‌తి  ప్ర‌కారం న‌డుస్తుంది. దీంతో ఇదిగో ఇలాంటి క్రౌడీ సీన్లు మీకు బుల్లి(టీవీ చానెళ్లు) అతి బుల్లి తెర‌లపై( మొబైల్ స్క్రీన్లు) ద‌ర్శ‌న‌మివ్వ‌డానికి రెడీ అయిపోతాయ్.

ఒక ర‌కంగా చెబితే.. వీరు ప్ర‌తి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌నూ ఒక సినిమా షూటింగ్ స్థాయిలో ప్లాన్ చేస్తారంటే అతిశ‌యోక్తి కాదు. కార‌ణం అక్క‌డ హీరోల సినిమాలు గొప్ప‌గా ఆడాలి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుర‌వాల‌న్న‌ది టార్గెట్. అదే ఇక్క‌డ జ‌గ‌న‌న్న క్రేజ్ ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న రోడ్డు మీద‌కొస్తే ఇస‌కేస్తే రాల‌నంత జ‌నం వ‌స్తున్నార‌న్న ప‌బ్లిసిటీ పీక్ లో ఉండాల‌ని ఫిక్స్ అవుతారు. త‌ద్వారా త‌మ సాలిడ్ ఓటు బ్యాంకును మ‌రింత యాక్టివ్ చేస్తుంటారు.ఎందుకంటే త‌మ‌కు ఓటు వేసే వారికి.. జ‌గ‌న్ కి క్రేజ్ ఉంద‌ని తెలియ‌డం కూడా ముఖ్య‌మే. కార‌ణం.. ఏ వార్త‌ల్లో లేని జ‌గ‌న్ కి వాళ్లు మాత్రం ఎందుకు ఓటు వేయాలి?

 

ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ స్కెచ్. ఇందులో అవ‌స‌ర‌మైతే ఎంద‌రు ప్రాణాలు పోయినా ప‌ర్లేదు. కానీ.. తామ‌నుకున్న ప్ర‌చారం మాత్రం ఒక రేంజ్ లో సాగాల‌న్న‌ది.. వీరి ప్ర‌ధాన టార్గెట్ గా తెలుస్తోంది. జ‌గ‌న్ ప‌దే ప‌దే ఒక మాట అంటూ ఉంటారు. మ‌న‌కంటూ ప్ర‌త్యేకించి ఛానెళ్లు, ఇత‌ర మీడియా నెట్ వ‌ర్క్ తో ప‌ని లేదు.. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మ‌న ప‌ని అదే సులువు అవుతుంద‌ని ఆయ‌న అనేది ఇందుకే. ఎందుకంటే ఏ పొలం ప‌నులో, ఇత‌ర ప‌నీ పాట‌ల్లో ఉండే త‌న ఓట‌ర్ల చేతుల్లో అయితే ఫోన్లుంటాయి. వాటిల్లో ఈ విజువ‌ల్ క్లిప్పింగులు ప‌దే ప‌దే క‌నిపిస్తే చాలు.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ మ‌న ఓటు బ్యాంకు అలాగే నిలిచ ఉంటుంద‌న్న ఆలోచ‌న ఇందులో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటారు కొంద‌రు విశ్లేష‌కులు.

By
en-us Political News

  
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.