జగన్‌కి ఇంత పబ్లిక్..ఎలా వస్తారో మీకు తెలుసా?
Publish Date:Jul 13, 2025
.webp)
Advertisement
జగన్ చుట్టూ ఇంత మంది జనం.. రియలా ఫేకా? అసలేంటీ పొలిటికల్ పబ్లిక్ స్టోరీ? అన్నదిప్పుడు చర్చనీయాంశం. బేసిగ్గా జగన్ కి బీసీ-ఎస్సీ-ఎస్టీ- ముస్లిం- క్రిష్టియన్- మైనార్టీల్లో ఓటు బ్యాంకు ఉన్న మాట నిజం. ఆ సాలీడ్ ఓటు బ్యాంకే మొన్నటి ఎన్నికల్లో 39 శాతం ఓట్లు పడేలా చేసింది. ఈ ఓటర్లు నిజానికైతే.. అంత ఫ్రీగా దొరికే వారు కాదు. ఎందుకంటే వీరు దైనందని జీవితాల్లో యమ బిజీగా ఉంటారు. కారణమేంటంటే వారు నిత్యం ఏదో ఒక పనీ పాట చేసుకోకుంటే పూట గడవదు. ఒక రకంగా చెబితే రెక్కాడితే గానీ డొక్కాడదు. అలాంటి జనం జగన్ రావడంతోటే ఇంతగా రోడ్డెక్కతారా? ఒక సినిమా నటుడికి మల్లే ఇంతగా పిచ్చెక్కి ఆయనపై ఎగబడతారా? అన్నదొక సస్పెన్స్. అయితే ఇక్కడే కొందరికి ఒక డౌట్ వస్తోంది. కారణమేంటంటే.. ఇదంత ఒరిజినల్ ఫ్యాన్ బేస్ కాదన్నది ఒక అంచనా. కారణం మనం ఇందాకే మాట్లాడుకున్నాం. జగన్ కి ఉన్న ఓటు బ్యాంకు ఎలాంటిదో గుర్తు చేసుకున్నాం. వారంత తీరిగ్గా.. ఇలాంటి రాజకీయ దండయాత్రలకు రారు.
ఒక వేళ వస్తే.. ఇంట్లో పొయ్యిలో పిల్లి ఆ రోజంతా అలాగే నిద్ర పోయే పరిస్థితి.మరి వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వీరికేం పనీ పాటా లేదా? అంటే ఇక్కడ కూడా మనకొక ఉదాహరణ దొరుకుతుంది. తాజాగా పేర్ని నాని ఒక వీడియో లీక్ అయ్యింది. ఆయన జనాన్ని ఎలా పురమాయిస్తారో అన్న విషయం పిచ్చ క్లారిటీతో ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. అంతే కాదు గతంలో జగన్ అధికారంలో ఉండగా.. ఆయన ప్రోగ్రామ్స్ కి ఏ టూ జెడ్ సర్వీస్ అందించే వారున్నారు. ఈ బాధ్యతలన్నిటినీ తలశిల రఘురామ్ చూసుకునే వారని చెబుతారు. ఇక స్క్రిప్టింగ్ కి ఒక టీమ్ ఇలా.. జగన్ తన పొలిటికల్ జర్నీలో ఇలాంటి వంధిమాగధులను పుష్కలంగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. వీరందరికీ అధినాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వహించగా.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పర్యవేక్షణ చేస్తుంటారట.
జగన్ చుట్టూ ఇంత కోటరీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కోటరీ పనల్లా ఏంటంటే.. జగన్ ఎ క్కడికి వస్తే అక్కడికి జనాన్ని తోలడం. ఆయా ఏర్పాట్లు చేయడం. మొన్నటికి మొన్న బంగారు పాళ్యం మామిడి కాయల వ్యవహారం చూసే ఉంటాం. తన పల్నాడు పర్యటనలో ఏ విధంగా.. తలకాయను తన కారు టైర్ల కింద వేసి తొక్కించాడో సరిగ్గా అలాగే.. మామిడికాయలను కూడా రప్పా రప్పా వేసి తొక్కించిన దృశ్యాలను చూసే ఉంటాం.ఇవేవీ యాధృచ్చికంగా జరుగుతున్నవి కావంటారు. వీటన్నిటి వెనక అతి పెద్ద నెట్ వర్క్ పని చేస్తూ ఉంటుంది. జగన్ పని అయిపోయింది. ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావు. ఇక ఆయన్ను భారీ ఎత్తున లీడర్లు కూడా వదిలేస్తున్నారు.. అన్న కామెంట్ వినిపించినపుడల్లా.. ఈ నెట్ వర్క్ అమాంతం ఉలిక్కి పడుతుంది. జగన్ ఇమేజీని పెద్ద ఎత్తున జాకీలేసి లేపడానికి.. వీరంతా కూడబలుక్కుంటారు. జూమ్ మీటటింగులు చేసుకుంటారు. కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకుంటారు.. అంతే ఒక ప్రణాళిక సిద్ధం చేసి జగన్ కి అప్ డేట్ చేస్తారు.
అన్నా అక్కడ మన గంజాయ్ బ్యాచ్ అరెస్టయ్యింది. వాళ్లంతా మనం సరఫరా చేసిన గంజాయ్ తీస్కునే ఇలా తయారయ్యారు. అలాంటి వాళ్లు అరెస్టయితే ఓదార్చాల్సింది మనమే అని అలెర్ట్ చేస్తారు. ఎప్పుడో గత ఏడాది చనిపోయిన నాగమల్లేశ్వరరావు విగ్రహం పెట్టడానికి చందాలిచ్చాం. మీరొస్తే బాగుంటుంది.. అని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. అలా అలా ఈ నెట్ వర్క్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. దీంతో ఇదిగో ఇలాంటి క్రౌడీ సీన్లు మీకు బుల్లి(టీవీ చానెళ్లు) అతి బుల్లి తెరలపై( మొబైల్ స్క్రీన్లు) దర్శనమివ్వడానికి రెడీ అయిపోతాయ్.
ఒక రకంగా చెబితే.. వీరు ప్రతి జగన్ పర్యటననూ ఒక సినిమా షూటింగ్ స్థాయిలో ప్లాన్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. కారణం అక్కడ హీరోల సినిమాలు గొప్పగా ఆడాలి కలెక్షన్ల వర్షం కురవాలన్నది టార్గెట్. అదే ఇక్కడ జగనన్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. ఆయన రోడ్డు మీదకొస్తే ఇసకేస్తే రాలనంత జనం వస్తున్నారన్న పబ్లిసిటీ పీక్ లో ఉండాలని ఫిక్స్ అవుతారు. తద్వారా తమ సాలిడ్ ఓటు బ్యాంకును మరింత యాక్టివ్ చేస్తుంటారు.ఎందుకంటే తమకు ఓటు వేసే వారికి.. జగన్ కి క్రేజ్ ఉందని తెలియడం కూడా ముఖ్యమే. కారణం.. ఏ వార్తల్లో లేని జగన్ కి వాళ్లు మాత్రం ఎందుకు ఓటు వేయాలి?
ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ స్కెచ్. ఇందులో అవసరమైతే ఎందరు ప్రాణాలు పోయినా పర్లేదు. కానీ.. తామనుకున్న ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో సాగాలన్నది.. వీరి ప్రధాన టార్గెట్ గా తెలుస్తోంది. జగన్ పదే పదే ఒక మాట అంటూ ఉంటారు. మనకంటూ ప్రత్యేకించి ఛానెళ్లు, ఇతర మీడియా నెట్ వర్క్ తో పని లేదు.. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మన పని అదే సులువు అవుతుందని ఆయన అనేది ఇందుకే. ఎందుకంటే ఏ పొలం పనులో, ఇతర పనీ పాటల్లో ఉండే తన ఓటర్ల చేతుల్లో అయితే ఫోన్లుంటాయి. వాటిల్లో ఈ విజువల్ క్లిప్పింగులు పదే పదే కనిపిస్తే చాలు.. వచ్చే ఎన్నికల వరకూ మన ఓటు బ్యాంకు అలాగే నిలిచ ఉంటుందన్న ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని అంటారు కొందరు విశ్లేషకులు.
http://www.teluguone.com/news/content/ys-jagan-39-201914.html












