అది జగన్ మార్క్...క్యూఆర్ స్కాన్ కాదు స్కామ్ గురూ
Publish Date:Jun 29, 2025
.webp)
Advertisement
ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో అంటే ఏంటంటే.. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో. దీన్ని కొత్తగా నిర్వహించాలని థింక్ చేసిన జగన్ అండ్ కో.. స్వామి కార్యం స్వకార్యం చక్కబెట్టే యత్నం చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి అతి కారణంగా తీవ్రంగా నష్టపోయినట్టు గత కొంత కాలంగా పార్టీలో ఉన్న సొంత నాయకులే కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఇపుడీ క్యూఆర్ కోడ్ అందులో భాగమని.. ఇది కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కిందకే వస్తుందని భావిస్తున్నారు.
గతంలో గడప గడపకూ వైసీపీ చెప్పుకోడానికి క్రేజీగానే ఉన్నా.. అందులోంచి వచ్చిన ఫలితాలు రివర్స్ కొట్టిన విషయం తెలిసిందే. జనం ఈ విధానం దారుణంగా తిప్పి కొట్టిన విషయం మనమంతా చూసే ఉంటాం. ఎవరైనా తెలివైన వారు ఇలాంటి వారికి పూర్తి దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ దీనికి కొనసాగింపుగా వస్తోన్న కొత్త విధానమేంటంటే.. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది తరహాలో ఒక క్యూ ఆర్ కోడ్ పాంప్లెంట్ పట్టుకుకెళ్లేలా ఒక ఎత్తుగడ. తద్వారా వాళ్ల ఫోన్లో స్కాన్ తీయించి.. కూటమి ప్రభుత్వంలో ఆయా లబ్ధిదారులకు ఏయే పథకాలు వచ్చాయో చూస్తారు. తద్వారా ఒక డాటా బయటకు తీయాలన్నది ఒక ఆలోచన. అప్పట్లో స్కీములు తీసుకున్న వారెవరు? ఇప్పుడు కొత్తగా ఆ పథకాలు కోల్పోయిన వారెవరు? అన్నది బయటకు లాగాలన్నది జగన్ మార్క్ స్కెచ్
అయితే ఇక్కడ మరో ప్రమాదమేంటంటే.. వైసీపీలో ఉండేవారంతా దాదాపు రౌడీ బ్యాచ్. మొన్న తెనాలి, తర్వాత పల్నాడు సంగతి చూసే ఉంటాంగా. గంజాయి తాగేవాళ్లు, బెట్టింగులు ఆడే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఒకసారిగానీ ఈ స్కాన్ లోకి గానీ మన ఫోన్ నెంబర్, దానికి అటాచ్ అయిన ఉన్న బ్యాంకు ఖాతాలు ఇతర వివరాలుగాని వెళ్తే.. ఇంకేం లేదు.. ఖాతాలకు ఖాతాలు ఖాళీ అయిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదంతా ఇలా ఉంటే మన ఇంట్లోని పూర్తి వివరాలు వారి చేతికి వెళ్తే.. ఎప్పుడు ఎలాంటి కండీషన్లో మనపై సైబర్ దాడులు జరుగుతాయో చెప్పలేం. దానికి తోడు కుటుంబంలోని ఆడపిల్లలు వారి వివరాలు కూడా వీటి ద్వారా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఒక కుటుంబ గోప్యత మొత్తం వారి గుప్పెట్లోకి వెళ్లిపోతుంది కాబట్టి.. బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటున్నారు సైబర్ ఎక్స్ పర్ట్స్.
http://www.teluguone.com/news/content/ys-jagan-39-200886.html












