ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఆస్తుల పంపకం విషయంలో తలెత్తిన నిస్సందేహంగా వైఎస్ కుటుంబ పరువును బజారున పడేంది. ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని అంటారు. జగన్,షర్మిల విషయంలో అదే జరుగుతోంది. ఆస్తుల విభేదాలు ఎలా ఉన్నా వైఎస్ కుటుంబం లోని లొసుగులన్నీ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో బయటపడి వైఎస్ కుటుంబం నవ్వుల పాలౌతోంది. జగన్, షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం కంటే ఆస్తి గొడవలే పెద్ద పీట వేసుకు కూర్చున్నాయి.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజా సానుభూతి షర్మిల వైపే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను గద్దెనెక్కడం కోసం చెల్లెలు కాళ్లరిగేలా చేసిన పాదయాత్ర, తాను జైలులో ఉన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపించిన వైనం గుర్తు చేసుకుంటూ పబ్బం గడిచిన తరువాత జగన్ షర్మిలను పార్టీ నుంచి పంపేశారనీ, తల్లిని సైతం అమర్యాదగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయించి పంపేరనీ ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల తగాదాలో జగన్ రాజకీయం కూడా ప్రస్తావనకు, చర్చకు వస్తున్నది. అది పక్కన పెడితే తన తరఫు వాదనను షర్మిల మాత్రమే వినిపిస్తుండగా జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని వైసీపీ నేతలు షర్మిలపై విరుచుకుపడుతున్నారు. ఈ వివాదంలో వైఎస్ కుటుంబ బంధువు వైవీ సుబ్బారెడ్డి, వారి కుటుంబానికి సన్నిహితుడు విజయసాయి రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి షర్మిల అవాస్తవాలు చెబుతున్నదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంకో అడుగు ముందుకు ముందుకు వేసి చంద్రబాబుకు అనుకూలంగా షర్మిల మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
అయితే ఈ తరుణంలో వైఎస్ విజయమ్మ రంగ ప్రవేశం చేసి షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖ రాయడంతో వైసీపీ నేతల విమర్శలను పట్టించుకునే నాథుడే లేకపోయాడు. అయినా షర్మిలకు జగన్ అన్యాయం చేశారనే మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. అయితే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ ఆత్మగా అందరూ భావించే కేవీపీ రామచంద్రరావు షర్మిల, జగన్ ఆస్తుల వివాదం విషయంలో నోరు మెదపకపోవడం గమనార్హం.
వైఎస్ బతికి ఉండగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ ప్రత్యక్ష సాక్షి కేవీపీ రామచంద్రరావు. వైఎస్ షర్మిలకు కుటుంబ ఆస్తులలో సమాన వాటా ఇవ్వాలని భావించారా లేదా అన్న విషయాన్ని సాధికారికంగా చెప్పగలిగిన వ్యక్తి కేవీపీ మాత్రమే. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని పెట్టుకున్నా కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయినా జగన్ శ్రేయోభిలాషిననే ఆయన చెప్పుకుంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనపై ఆయన గట్టిగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ, కేవీపీ ఆమో పక్కన పెద్దగా కనిపించిందీ లేదు. మద్దతు పలికిందీ లేదు. అందుకే షర్మిల, జగన్ ఆస్తుల వివాదంలో కేవీపీ ఏం మాట్లాడినా ఇంపార్షియల్ గా ఉంటుందని జనం భావిస్తారు. ఆయన కనుక నోరు తెరిచి షర్మిలకు సమాన వాటా ఇవ్వాలని వైఎస్ భావించారన్న మాట చెబితే ఇక జగన్ రాజకీయ భవిష్యత్ కు ఎండ కార్డ్ పడినట్లునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-family-dispute-kvp-silense-39-187739.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.