Publish Date:Dec 24, 2025
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఆ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడమన్నది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. పులివెందులలోని తమ పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. పులివెందులలోని వైఎస్ నివాసంలో వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
షర్మిల వినా ఈ వేడకకు వైఎస్ కుటుంబంలోని దాదాపు అందరూ హాజరయ్యారు. జగన్, ఆమె తల్లి విజయమ్మా చాలా కాలం తరువాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి కలిగించింది. అయితే వారిరు వురూ దూరందూరంగా కూర్చోవడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వేడుక ఎప్పుడు జరిగింది? అన్న విషయంపై స్పష్టత లేదు. ఆ ఫొటో ఈ ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినదా, పాతదా అన్న అనుమానాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సామాజిక మాధ్యమంలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ షర్మిల ఎక్కడ అంటూ నెటిజనులు పోస్టు చేస్తున్నారు.
ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉండటం ఈ ఫొటో తాజాదే అయి ఉంటుందని భావించవ చ్చునని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్, షర్మిల మధ్య దూరం తరగలే దనడానికి ఈ ఫొటో నిదర్శనంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల షర్మిల ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందుకు ధాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రిప్లై ఇవ్వడంతో ఇరువురి మధ్యా సయోధ్య ఏర్పడిందన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఇప్పుడు తాజాగా పులవెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు జరుపుకున్న మినీ క్రిస్మస్ వేడుకల్లో షర్మిల కనిపించకపోవడం వీరి మధ్య విభేదాలపై మరో సారి చర్చకు తెరలేపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-family-celebrates-mini-christmas-25-211489.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!