ఉరకలేసే యువత, ఉత్సాహం నిండిన కార్యకర్తలే తెలుగుదేశం శక్తి, ఆస్తి.. చంద్రబాబు

Publish Date:May 27, 2025

Advertisement

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉరకలేసే ఉత్సాహం. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే  యువశక్తి  తెలుగుదేశం ఆస్తి అని పేర్కొన్న ఆయన  తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం కర్తవ్యమన్నారు. ప్రపంచ దేశాలలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నంబర్ వన్ గా, వారు ఉన్న దేశానికే తలమానికంగా మారాలన్నదే మన సంకల్పమని, అందుకోసమే నిరంతరం శ్రమస్తున్నామనీ పేర్కొన్నారు.

ఎన్ని కష్టాలు, అవరోధాలు, అడ్డంకులూ ఎదురైనా తెలుగుదేశం ముందడుగు వేస్తూనే ఉందనీ, ప్రతి పరీక్షా సమయంలోనూ వజేతగానే తెలుగుదేశం పార్టీ నిలిచిందని చెప్పిన చంద్రబాబు అందుకు కార్యకర్తల దీక్షాదక్షతలు కారణమన్నారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.  మహానాడు సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం అవుతూ, యువగళానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగు అన్నదాతకు అండగా నిలుస్తూ, స్త్రీశక్తికి పెద్ద పీట వేయాలని, పేదల సేవకు నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్య సాధన దిశగా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు ఉద్భోదించారు.  

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.