అగ్రరాజ్యంలో యోగా ఫీవర్.. ఘనంగా యోగా డే!

Publish Date:Jun 19, 2026

Advertisement

భారత ప్రాచీన సంస్కృతి, జీవన విధానమైన యోగాకు  ప్రపంచవ్యాప్తంగా  ఆదరణ లభిస్తోంది. అగ్రరాజ్యంలో యోగా ఫీవర్ అక్కడి వారిని కుదిపేస్తోంది.  వాషింగ్టన్   యోగా ప్రాభవం మరోసారి డిజిటల్ తెరపై ప్రకాశించింది. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన వాషింగ్టన్ లింకన్ మెమోరియల్ వేదికగా   అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ భారీ ఈవెంట్‌లో వందలాది మంది అమెరికన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నేషనల్ మాల్ మొత్తం ఒక పెద్ద బహిరంగ యోగా శిబిరంగా మారిపోయింది. 

ఈ ఏడాది వేడుకలను ఒక ప్రత్యేకమైన థీమ్ తో  నిర్వహించారు. "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా  అనే  ధీమ్ తో  ఈవెంట్ జరిగింది.   ఈ కార్యక్రమంలో కేవలం భారత సంతతి ప్రజలే కాకుండా,  అమెరికన్ పౌరులు, ప్రఖ్యాత యోగా శిక్షకులు, పలువురు ఉన్నతాధికారులు కూడా భాగస్వాములయ్యారు. .

ఈ వేడుకల్లో భాగంగా అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా  తన ప్రసంగంలో  భారత  ప్రాచీన సంప్రదాయం నుంచి పుట్టిన యోగా, నేడు గ్లోబల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ ఆచరించే ఒక గొప్ప జీవనశైలిగా రూపాంతరం చెందిందన్నారు. చారిత్రాత్మక లింకన్ మెమోరియల్ వద్ద   12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంత భారీ ఎత్తున జరుపుకోవడం గర్వకారణమన్న ఆయన . యోగా అనేది ఏ ఒక్క దేశానికో, మతానికో లేదా సంస్కృతికో పరిమితమైనది కాదనీ.. ఇది సరిహద్దులను దాటి మానవాళినంతటినీ ఏకం చేసే మహత్తర శక్తి అని అభివర్ణించారు. అమెరికా సమాజంలో యోగా కేవలం ఒక ట్రెండ్ లాగా ప్రాచుర్యం పొందడమే కాకుండా.. అక్కడి ప్రజల నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన అంతర్భాగంగా మారిపోయిందన్నారు.

ఈ   కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విదేశీయులు,  ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. యోగా సాధన  వల్ల తమ శరీరం, మనస్సు  ఆత్మ నూతనోత్తేజంతో రీఛార్జ్ అయ్యాయన్నారు. మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి భారతదేశం అందించిన   గొప్ప కానుకగా యోగాను వారు అభివర్ణించారు.   

By
en-us Political News

  
న్యూజిలాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ 12 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధించింది. అలాగే ఆటగాళ్లకు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో కేవలం 10 రోజుల్లోనే 8 ఓన్ గోల్స్ నమోదయ్యాయి. 2018 రష్యా రికార్డును బద్దలు కొట్టే దిశగా సాగుతున్న ఈ విచిత్రమైన ఫుట్‌బాల్ రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సింధు జలాల వివాదాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఈ ప్రమాదంలో కనీసం 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల విధులు నిర్వహిస్తున్న మరో 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష సాయుధ గ్రూపులను ఇరాన్ వెంటనే నియంత్రించకపోతే, ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన బాంబు దాడులు, సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చర్చల హాల్‌లోకి చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ చేసిన తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, ర రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.