ఔను ఆ నులుగురు ఒకటయ్యారు!

Publish Date:Apr 29, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చును. అదే కాంగ్రెస్ పార్టీ విలక్షణ లక్షణం. కాంగ్రెస్ నాయకులు తమలో తాము కొట్టు కుంటారు .. తిట్టుకుంటారు.. కానీ కురు పాండవుల లాగ వసరం అయితే ఒకటైపోతారు. వారి మధ్య  ఎన్నైనా విబేధాలు ఉండవచ్చును. కానీ, అవసరం అనిపిస్తే  అందరూ కలిసి పోతారు.  మళ్ళీ అంతలోనే విడిపోతారు. అయితే, బయటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది పక్కన పెడితే, పార్టీలో ఉన్నంతవరకు కొట్టుకున్నా తిట్టుకున్నా చివరకు ఒకటై పోతారు. అందుకే  కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన పెద్దలు  కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ కొట్టు కున్నప్పుడు కొట్టుకున్నా, ఎన్నికల అవసరం ఏర్పడినప్పుడు అంతా మరిచి పోయి పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తారని అంటారు. 

ఇందుకో తాజా ఉదాహరణ  శుక్రవారం(ఏప్రిల్ 28)  నల్గొండ జిల్లాలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన సభ.  నిజానికి ఈసభ వారం రోజుల క్రితం ఏప్రిల్ 21 జరగవలసింది. అయితే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరితోనూ చర్చించకుండా ఏక పక్షంగా కార్యక్రమం ప్రకటించడంతో  జిల్లాకు చెందిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి కస్సుమన్నారు. రేవంత్ రెడ్డి దిగి వచ్చారు. ఏప్రిల్ 21న జరగవలసిన సభను ఆ ఇద్దరు ఎంపీలతో పాటుగా జిల్లాకు చెందిన మరో కీలక నేత  ప్రతిపక్ష మాజీ నేత, జానారెడ్డితోనూ చర్చించి ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.

అయినా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు ఈ సభకు హాజరవుతారా, హ్యాండిస్తారా అనే అనుమనాలు రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నాయి. ఒకరిద్దరు రాకూదని కుడా కోరుకున్నారు. అయితే అనూహ్యంగా ముగ్గురు సీనియర్ నాయకులూ ఉత్తమ్ కుమార రెడ్డి, కోమటి రెడ్డి,  జానారెడ్డి  సభకు హాజరయ్యారు. అంతే కాదు విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపైకి వచ్చి చేయి చేయి కలిపారు. అంతా ఐక్యంగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కార్యకర్తల సాక్షిగా ప్రకటించారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఇలా తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ దృశ్యం కళ్లముందు కనిపించడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వాస్తవానికి రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేతలంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారేనన్నది తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి రేవంత్‌ను వారు జిల్లాలో అడుగు కూడా పెట్టనివ్వడంలేదు. అయితే ఇప్పుడు గతం గతః అన్నట్లుగా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి, వి.హనుమంతరావు వంటి దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.అయితే ఇది ఎంతకాలం ఉంటుంది అనేది ఒకటైతే నల్గొండ నేతలు తాత్కాలికంగానే అయినా సైలెంట్ అయినా, మెదక్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గా రెడ్డి కొత్త బాణిలో  అసమ్మతి రాగాన్ని శృతి చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును..అంటారు. అంటున్నారు

By
en-us Political News

  
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.