వైసీపీకి ప‌సుపు భీతి!

Publish Date:Aug 26, 2022

Advertisement

ప్ర‌తి మ‌నిషికీ ఒక రంగు ప‌ట్ల ఇష్టం ఉంటుంది. దారికి కార‌ణం ఫ‌లానా అని చెప్ప‌లేక‌పోవ‌చ్చు. అలాగే వేరే రంగు ప‌ట్ల అయిష్ట‌తా ఉంటుంది. కొంద‌రికి కేవ‌లం తెలుపే యిష్టం, కొందరికి గులాబీ యిష్టం ఉంటే ఇంకొంద‌రికి ప‌సుపు, నీలం బాగా యిష్టం. సాధార‌ణంగా ప‌సుపు శుభ‌కార్యాల్లో ఎక్కువ‌గా క‌నిపించే రంగు. దానికి ఆ ప్రాధాన్య‌త ఉంది. కానీ వైసీపీవారికి మాత్రం ప‌సుపు బొత్తిగా ప‌డ‌టం లేదు. ఆ రంగులో ఏది క‌న ప‌డినా విసుక్కుంటున్నారు. దీనికి కార‌ణం అంద‌రికీ తెలిసిందే. ప‌సుపు తెలుగుదేశం పార్టీవారిది. అందు వ‌ల్ల ప‌సుపు దుస్తుల్లో ఎవ‌రు క‌నిపించినా ఫ్యాన్‌వారికి ఉండ‌డం కాస్తంత ఇబ్బందిక‌రంగా ఉంటుంది. 

ప‌సుపు స‌ర్వ‌మంగ‌ళ‌ప్ర‌దాయ‌ని అనే అభిప్రాయంతోనే తెలుగుదేశం ఆవిర్భావంలో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆ రంగుకి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చారు. అందువ‌ల్ల అలా ఆ రంగు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుం టూంది. అయితే ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ‌ప‌రంగానూ రంగుల్ని చూస్తున్నారు గ‌నుక వైసీపీవారికి ప‌సుపు బొత్తిగా గిట్ట‌డం లేదు. ప‌సుపు బ్యాక్‌గ్ర‌గౌండ్‌లో సైకిల్ గుర్తు టీడీపీవారి గుర్తు. దీన్ని క‌ల‌లో కూడా చూడ‌ద‌ల‌చు కో లేదు వైసీపీ వారు. 

కానీ  ఏపీలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీ కొత్త రెండింత‌ల ఉత్సాహంతో ఉర‌క‌లు వేస్తోంది. ఏపీలో వైసీపీ స‌ర్కార్‌కు అభిమానం, ప్ర‌తిష్ట కొంత త‌గ్గింద‌న్న అభిప్రాయాలే ఎక్కువ‌గా విన ప‌డుతున్నాయి. దీనికి తోడు మంతులు, ఎమ్మెల్యేలు ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు గ‌తంలో వ‌లె బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్ట‌డం లేదు. ఎందుకు వ‌చ్చార‌న్నట్టు చూపులు, ప్ర‌శ్న‌లు సంధించ‌డంతో అవ‌మాన‌ప‌రుస్తున్నారు. పాలనా కాలం మూడేళ్లు ముగిసినా ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌న‌సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేక‌పో వ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్యానికి అద్దంప‌డుతుంది. ఇచ్చిన హామీలు, ప‌థ‌కాలు  అన్నీ నీరుగారాయి.  

ఈ  ప‌రిస్థితుల్లో ఆగ‌ష్టు 25న కృష్ణాజిల్లా పెడ‌న‌లో నేత‌న్న నేస్తం పేర ఒక కార్య‌క్ర‌మం జ‌రిగింది. అక్క‌డి వారు స‌భాప్రాంగ‌ణాన్ని వైసీపీ ప‌తాకాల‌తో నింపేశారు. ఎక్క‌డా ప‌సుపు, న‌లుపు రంగులు క‌న‌ప‌డ‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇది వైసీపీ సంబంధించిన కార్య‌క్ర‌మం గ‌నుక టీడీపీ రంగు, ప‌తాకా లూ ఎక్క‌డా క‌న‌ప‌డ‌కుండా ఉండ‌ట‌మే మంచిద‌ని వారి అభిప్రాయం కావ‌చ్చు, లేదా విప‌క్షాల‌వారు వ‌చ్చి గొడ‌వ‌లు, ర‌భ‌సా సృష్టిస్తారేమోన‌న్న అనుమానమూ కావ‌చ్చు. ఏమ‌యిన‌ప్ప‌టికీ ప‌సుపు రంగు క‌న‌ప‌డ‌కుం డా ఉండ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు. 

పెడనలో ‘నేతన్న నేస్తం’ నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సభకు ఒక వృద్ధుడు పసుపు రంగు చొక్కా వేసుకుని వచ్చారు. అది చూడగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక మహిళా ఎస్సై ఆయనను ఆపారు.  అతడి తలకున్న టవల్‌ తీయించి, చొక్కాపై కప్పించారు.  పైగా ఎట్టి పరిస్థితి లోనూ పైన కప్పుకున్న టవల్‌ తీయవద్దు. పసుపు చొక్కా కనిపించవద్దు’ అని హెచ్చరించారు. పసుపు రంగు చీర ధరించిన ఓ మహిళ వేదిక సమీపానికి వెళ్లకుండా అడ్డుకన్నారు. నలుపు రంగు చున్నీలు, మాస్కులు ధరించిన వారిని కూడా పోలీసులు అటకాయించారు. చున్నీలు, మాస్కులు తొలగించిన తర్వాతే లోనికి అనుమతించారు. 

ఇదిలా ఉండ‌గా,  అస‌లు పెడనలో సీఎం సభ ప్రారంభం కాకుండానే జనం వెనుతిరిగి వెళ్లడం కనిపిం చింది. సీఎం సభ ప్రకటించిన సమయానికంటే కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.  ఓవైపు  వ్యాన్లు, బస్సు ల్లో జనాన్ని లోపలికి పంపిస్తుండగా, మరోవైపు నుంచి కొందరు బయటకు వెళ్లడం కనిపించింది.  సీఎం వచ్చాక కూడా ఆయన ప్రసంగం వినకుండానే కొందరు వెళ్లిపోయారు. సీఎం ప్రసంగం రుచించక మరి కొందరు వెళ్లిపోవడం గమనార్హం. 

కాగా, ఈ సభలో సీఎం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనన్న ఆశతో ఎదురు చూసిన చేనేత కార్మికులకు నిరాశే ఎదురయింది. చేనేత సమస్యలన్నింటికీ నేతన్న నేస్తమే పరిష్కారమన్నట్లుగా ఆయన ప్రసంగం సాగడం, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల ప్రస్తావన లేకపోవడంపై నేత న్నలు పెదవి విరిచారు. సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత సంఘాలను బయటపడేస్తానన్న హామీ కూడా  సీఎం నోట రాలేదు. 

తమకూ నేతన్న నేస్తం వర్తింపజేస్తామని సీఎం ప్రకటిస్తారేమోనని ఆశతో ఎదురుచూసిన అనుబంధ వృ త్తుల కార్మికులకు నిరాశ మిగిలింది. సభ నుంచి వెళ్లిపోతున్న ప్రేక్షకులను వైసీపీ కార్యకర్తలు లోప లకు పంపేందుకు ప్రయత్నాలు చేసినా.. సీఎం ప్రసంగం చప్పగా సాగడం, ఎండ తీవ్రత కారణంగా జనం చివరి వరకు ఉండకుండా వెనుదిరిగారు.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.