ఏపీలో బీఆర్ఎస్ కు వైసీపీ స్వాగతం

Publish Date:Dec 12, 2022

Advertisement

వైసీపీ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు స్వాగతం పలుకుతోంది. ఇంకా ఏపీలో అడుగే పెట్టని బీఆర్ఎస్ కు వైసీపీ రెడ్ కార్పెట్ లో స్వాగతం పలకడానికి సిద్ధమౌతోంది. రాజకీయ లబ్ధి కోసం.. వైసీపీ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ తెలంగాణలో మైలేజ్ పెంచుకున్న టీఆర్ఎస్ పార్టీయే పేరు మార్చుకుని బీఆర్ఎస్ గా మారింది.

అటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలోకి ఆహ్వానిస్తే తనకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తోంది. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడితే ఎవరికి రాజకీయంగా నష్టం జరుగుతుందన్న చర్చ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో వైసీపీ కేసీఆర్ బీఆర్ఎస్ కోరితే ఆ పార్టీకి మద్దతు కూడా ఇస్తామని ప్రకటించింది. దీనిని బట్టే బీఆర్ఎస్ ఎంట్రీ తెలుగుదేశం కు రాజకీయంగా ఒకింత నష్టం చేస్తుందన్న భావన వైసీపీలో ఉందన్నది అవగతమౌతోంది. వైసీపీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి  అందుకే ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు   ఏపీలో బీయారెస్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ మద్దతు కావాలని కోరితే ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.  

ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ అయితే రాజకీయంగా వైసీపీకి లబ్ధి చేకూరుతుందన్న అంచనాలలో ఆ పార్టీ ఉంది.  అందుకే తెలంగాణ సీఎం కోరితే జగన్ ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని సజ్జల చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్ని విధాలుగా వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది. వైసీపీకి అనుకూలంగా ఏ పార్టీ కూడా లేదు. పైపెచ్చు విపక్షాలన్నీ ముఖ్యంగా జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీకి దగ్గరౌతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలి అధికార పార్టీకి లబ్ధి చేకూరాలంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీయే మార్గమని వైసీపీ తలపోస్తున్నది. అయితే ఇరు రాష్ట్రాలూ మళ్లీ కలవాలన్న నోటితోనే సజ్జల బీఆర్ఎస్ కు మద్దతు అనడాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అనుమానాలు అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.

ఇప్పటికే ఇరు రాష్ట్రాలూ మళ్లీ కలిసిపోతే స్వాగతించే విషయంలో వైసీపీ ముందుంటుంది అన్న వైసీపీ సీనియర్ నేత, రాజకీయ సలహాదారు సజ్జల మాటల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనన్న భావన కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఇందుకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య బహిరంగ రహస్య మైత్రి కూడా ఒక కారణమేనని చెప్పక తప్పదు. ఒకే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలుగు రాష్ట్రాల పున: విలీనం గురించి, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తెరాసకు ఏపీలో స్వాగతం గురంచీ సజ్జల చెబుతున్న మాటల వెనుక ఉన్న వ్యూహమేమిటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.