వైసీపీ, తెరాస గోదావరి వరద రాజకీయం

Publish Date:Jul 19, 2022

Advertisement

అన్ని దారులూ మూసుకుపోయి చివరకు గోదారే దిక్కు అయినట్లుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకు. గోదావరి వరద సాక్షిగా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపాయి వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు. ఇరు రాష్ట్రాలలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్లిప్తత, యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో విఫలం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు అపార నష్టానికి కారణమయ్యాయి.

ముఖ్యంగా రెండు రాష్ట్రాలూ కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యయి. అందుకే ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడంలోనూ, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంలోనూ సకాలంలో స్పందించలేకపోయాయి. దీంతో జనం రోజుల తరబడి వరద ముంపులో నానా ఇబ్బందులూ పడ్డారు. ఇప్పుడు, అసలే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న సమయంలో జనంలో వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి వారు వరద రాజకీయాలకు తెరతీశారు. దాంట్లోనూ సెంటిమెంటును రంగరించి మరీ కలుపుతున్నారు.

ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి సెంటిమెంట్ పండించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట మరొకడు. అలాగుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల పరిస్థితి. జనం వరదల్లో భారీగా నష్టపోయి నిలువ నీడ లేక అల్లాడుతుంటే.. వారిని ఆదుకోవడం పక్కన పెట్టి ముంపునకు కారణాలను రాష్ట్ర విభజనతో ముడిపెడుతున్నారు. ముందుగా ఈ క్రీడను తెరాస ఆరంభిస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా వైకాపా వచ్చి చేరిపోయింది. పోలవరం కారణంగానే భద్రాచలం మునిగిపోయిందంటూ పువ్వాడ విమర్శల పర్వానికి తెరతీసి విలీన మండలాల అంశం లేవనెత్తారు. ముంపు గ్రామాలను తెలంగాణలో కలిపేస్తే కరకట్ట ఎత్తు పెంచుకుని ముంపు ముప్పును శాశ్వతంగా పరిష్కరించుకుంటామన్నది పువ్వాడ వ్యాఖ్య. అయితే మేమేం తక్కువ తినలేదంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తెలుగు రాష్ట్రాలు రెంటినీ విలీనం చేసి సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్లు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆగిపోలేదు. హస్తినలో ఇరు పార్టీల ఎంపీలూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇక మళ్లీ పువ్వాడ వ్యాఖ్యల వద్దకు వస్తే..పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం మునిగిపోతుందని భద్రాచలంలోకి వరద నీరు ప్రవేశించకుండా, భద్రాచలం రామాలయం మునిగిపోకుండా కరకట్టలు నిర్మిస్తామని.. ఇందుకు దాని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వెంటనే   వరదలు వచ్చినప్పుడు ముంపు సహజమేనని.. ఇందుకోసమే ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని అంబటి అన్నారు. ఐదు గ్రామాలు కావాలంటే తామూ భద్రాచలం కావాలంటామన్నారు. ఇక బొత్స అయితే  రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ ఆదాయాన్ని తాము కోల్పోయామని.. మరి ఆ నగరాన్ని ఏపీలో విలీనం చేయాలంటే చేసేస్తారా అని ప్రశ్నించారు.

ఇలా ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ప్రజల కష్టాలను, వరదల్లో వారు పడుతున్న ఇబ్బందులనూ వదిలేసి.. రాజకీయ లబ్ధి కోసం విభజన నాటి అంశాలను తెరమీదకు తీసుకురావడం వెనుక మరో సారి అధికారం చేపట్టాలంటే ప్రజలలో సెంటిమెంట్ రగల్చడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతున్నది. అందుకే కూడబలుక్కునే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు మండలాలు ముంపునకు గురవుతాయి కనుకనే వాటిని అప్పట్లో ఏపీలో విలీనం చేశారన్నది జగద్వితం. ఆ మండలాల విలీనం తరువాతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు అప్పట్లో విస్ఫష్టంగా కేంద్రానికి చెప్పి సాధించుకున్నారు.

ఇప్పుడు మళ్లీ ఆ విలీన మండలాలు తెలంగాణలో కలపాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ సమస్యను పక్కదారి పట్టించి సెంటిమెంటును రగల్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు భద్రాచంల, హైదరాబాద్, సమైక్యాంధ్ర అంటూ చేస్తున్న వాదనలు కూడా ఇక్కడి సమస్యలను పక్కదారి పట్టించి మళ్లీ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా విభజన నాటి సెగలు రేపే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అంటున్నారు. ఇక ఏపీ జల వనరుల శాఖ మంత్రి ఎగువ కాపర్ డ్యాం ను ఆఘమేఘాల మీద మీటర్ ఎత్తును పెంచేశామనీ, దాని వల్లే పెనుముప్పు తప్పిందనీ చెప్పడం నేల విడిచి సాము చేశాం అని చెప్పుకోవడమే తప్ప ఒక్క రోజులో ఒక మీటర్ ఎత్తు పెంచామనడం ఏ విధంగానూ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్వయంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ అంగీకరించారని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు వేదికగా పోలవరం నిర్మాణంలో జాప్యానికి ఏపీలోని జగన్ సర్కార్ నిర్వాకమే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించిన రోజునే ఏపీ సర్కార్ పోలవరం పనులు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయని ఏపీ చెప్పుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకందుకు కాదని, అలాగే పోలవరం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందనీ, భద్రాచలం రామాలయం ఉనికే ప్రశ్నార్థకమౌతోందని తెలంగాణ గుండెలు బాదుకోవడం కూడా జనంలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికేననీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ఏపీ సర్కార్ హైదరాబాద్ ఆదాయం కోల్పోయామనీ, కేసీఆర్ సర్కార్ ఆంధ్రాపాలకుల దోపిడీ ఇంకా ఆగడం లేదనీ సెంటిమెంట్ ను ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు జనానికి కావలసింది సెంటిమెంట్ డ్రామాలు కాదనీ, బాధల్లో  ఉన్న వారికి తక్షణ సాయం అందించడమనీ అంటున్నాయి. మొత్తంగా గోదావరి వరదను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీల డ్రామాపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.