Publish Date:Apr 16, 2026
దేశవ్యాప్తంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ( ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ఈ ప్రక్రియ పట్ల ప్రాంతీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయనే వాదన ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం భిన్నంగా స్పందించింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ నియోజకవర్గాల పెంపు నిర్ణయాన్ని ఆ పార్టీ స్వాగతించింది.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
వాస్తవానికి దక్షిణాదికి చెందిన పలువురు కీలక నేతలు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు ఈ పునర్విభజన అంశంపై గట్టిగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన స్థానాల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో వైకాపా కూడా ఇదే బాటలో నడుస్తుందని అంతా భావించారు. అయితే సజ్జల చేసిన వ్యాఖ్యలు ఆ అభిప్రాయం తప్పని రుజువు చేశాయి.
కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎలాగూ ఎన్డీయేలో భాగంగా ఉండటంతో అవి ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా వైసీపీ కేంద్ర నిర్ణయానికి మద్దతు ప్రకటించడం గమనార్హం. పరిశీలకులు వైసీపీ స్టాండ్ పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి చట్టబద్ధత నుంచి తీసుకుంటే.. ఆ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకూ వ్యతిరేకంగా ఉన్నా సరే కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ స్వాగతించడం లేదా అభ్యంతరం తెలపకపోవడం వైసీపీ విధానంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసుల భయంతోనే కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తే ధైర్యం చేయడం లేదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-support-center-government-on-delimitation-39-217496.html
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.