Publish Date:Apr 16, 2026
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. పార్లమెంటులో తెలంగాణ ప్రాతినిధ్యాన్ని తగ్గించేలా లేదా రాష్ట్ర గొంతు నొక్కేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
నియోజకవర్గాలను బ్లాంకెట్‌గా 50 శాతం పెంచుతామని చెప్పడం పై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చూడటానికి ఇది సరైన నిర్ణయంలా కనిపించినా తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకూ నష్టం జరుగుతుందన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు తక్కువ సీట్లు వస్తాయనీ, దీంతో రాష్ట్ర రాజకీయ ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని కవిత అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉందని గుర్తుచేస్తూ, డిలిమిటేషన్ తర్వాత కూడా అదే శాతం కొనసాగాలని ఆమె డిమాండ్ చేశారు. “అలా కాకపోతే మరో తెలంగాణ ఉద్యమం తప్పదు” అని హెచ్చరించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును కవిత దుయ్యబట్టారు. పునర్విభజన తర్వాత దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రస్తుత నిష్పత్తిని బేస్‌లైన్‌గా తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జనాభా నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టగా కవిత అభివర్ణించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-telangana-movement-if-injustice-occurs-39-217492.html
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.