గోదావరి జిల్లాల్లో వైసీపీ జీరోయే!

Publish Date:Dec 31, 2023

Advertisement

ఏపీలో రానున్న ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖరారైంది. పరిశీలకుల విశ్లేషణలూ, సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, చివరాఖరికి ఐప్యాక్ రిపోర్టులూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. జగన్ కు కూడా విషయం అవగతమైనట్లే కనిపిస్తోంది.  అందుకే  పైకి ఎంత బింకంగా వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోన మాత్రం ఓటమి భయం   వెంటాడుతోంది. ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తిని కొంత వరకైనా తగ్గించాలని అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారు. ముందుగా ఇన్ చార్జిలను  మార్చేసి తర్వాత వారినే అభ్యర్థులుగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ ప్రయత్నం మరింత నష్టం తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఇప్పుడు జగన్ పై ఆగ్రహంతో ఉన్నారు. అసలే ప్రజలు తనని ఓడించేది ఖాయమైతే.. ఇప్పుడు ఎక్కడైనా ఏమూలో మిణుక్కుమిణుక్కు మంటూ గెలిచే అవకాశం ఉన్న స్థానాలను కూడా ఇన్ చార్జీల మార్పు పేరుతో జగన్ ఓటమి ఖాతాలో చేజేతులా వేసేసుకుంటున్నారు.  దీంతో ఈసారి వైసీపీకి ఘోర ఓటమి తప్పదని  పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, జగన్ మోహన్ రెడ్డి మొండిగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ కూడా ప్రతిపక్ష నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.

 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలు కీలకం. ఇక్కడ ఎక్కువ స్థానాలు ఏ పార్టీ సొంతం చేసుకుంటే ఆ పార్టీదే అధికారం. గత ఎన్నికలలో అధికారం దక్కించుకున్న వైసీపీ కూడా ఈ జిల్లల్లోఅత్యధిక స్థానాలను దక్కించుకుంది.  పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది.  రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా 19 స్థానాలకు గాను వైసీపీ 14 చోట్ల గెలిచింది. మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలకే ఇక్కడ అసంతృప్తి మొదలైంది. ఈ రెండు జిల్లాలో కాపు సామజిక వర్గం రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే  జగన్ కాపు రిజర్వేషన్లు కుదిరే అంశం కాదని తేల్చేయడం వైసీపీకి అతిపెద్ద మైనస్ గా మారింది. సాధారణ ప్రజలలో జగన్ పాలనపై అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తుండగా..  కాపులలో జగన్ పై ఆగ్రహం పెరిగింది. 

అదే సమయంలో మరోపక్క పార్టీలో అంతర్గత పోరు కూడా తీవ్రమైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వైరం తీవ్రస్థాయికి చేరి రెండు గ్రూపులుగా విడిపోయి ప్రత్యక్ష యుద్దానికి దిగారు. అమలాపురంలో కూడా మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాథ మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి పంపుతున్న ఎంపీ భరత్ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పిఠాపురం నుంచి దొరబాబును కాదని ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్న కాకినాడ ఎంపీ వంగా గీతపై కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. అలాగే మరో అరడజను స్థానాలలో కూడా వైసీపీది అదే పరిస్థితి. సరిగ్గా ఇప్పుడు ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. వైసీపీకి కనీస స్థానాలు కూడా దక్కకూడదని పవన్ టీడీపీతో కలిసి పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. 

పవన్ ఇప్పటికే రెండు వారాల కిందట మంగళగిరిలో ఉభయగోదావరి జిల్లాల నేతలతో  సమావేశమయ్యారు. తాజాగా కాకినాడ వేదికగా నియోజకవర్గాల రివ్యూ కూడా చేపట్టారు. కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో కూడా సమావేశమై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజలలో వైసీపీపై అసంతృప్తికి తోడు పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఇప్పటికే  కలవరం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడం.. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ  కలిసి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం చూస్తుంటే.. ఈసారి వైసీపీకి ఇక్కడ జీరో స్థానాలే ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.