జగన్ మేనమామ కూడా చెప్పేశారు.. ఫలితాలపై ఆశలొద్దని!

Publish Date:May 23, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ ఐదేళ్ల దుష్టపాలనను వదిలించేసుకుందా? ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ వైసీపీ నేతల మాటలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి ఉక్రోషం చూస్తుంటే.. విజయంపై నమ్మకాన్ని వాళ్లు వదిలేసుకున్నారని అనిపించక మానదు. ఎంత గంభీరంగా ఉందామని ప్రయత్నించినా, విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్లు నటిద్దామని ప్రయత్నించినా, వారికి తెలియకుండానే మాటల్లో నిరాశ, ముఖంలో నిర్వేదం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి.

నగరి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి రోజా పోలింగ్ రోజునే మీడియా ముందకు వచ్చి తనను తన పార్టీ వారే ఓడించడానికి ప్రయత్నించారని ఎవరూ అడగకుండానే తన ఓటమి మాట చెప్పేశారు. ఆ తరువాత సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు అయితే పోలీసులు తెలుగుదేశం వారితో కుమ్మక్కైపోయారని విమర్శలు గుప్పించి, తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకున్నారు. అంతే కాకుండా రీపోలింగ్ డిమాండ్ చేసి తనకు జనం ఓట్లు వేయలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తగదునమ్మా అని రీపోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు, ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఆత్మ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని పరోక్షంగా చెప్పేశారు. తన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని చడీచప్పుడు లేకుండా రాష్ట్రం దాటించేశారు. పోలింగ్ రోజు నుంచి సజ్జల భార్గవ్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ ఇలా పూర్తయ్యిందో లేదో వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళాలు పడిపోయాయి.

ఇక జగన్ భజనలో ఆరితేరిన కొమ్మినేని శ్రీనివాసరావు అయితే తొందరపడి బెట్టింగులూ గట్రా కట్టి సొమ్ములు పోగొట్టుకోకండి అంటూ అడగకుండానే వైసీపీ అభిమానులు, కార్యకర్తలకు ఒక ఉచిత సలహా పారేసి, వైసీపీ విజయంపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పేశారు. నిజానికి వైసీపీ గెలుపుపై బెట్టింగులు కాయడానికి వైసీపీ వారెవరూ సిద్ధంగా లేరనుకోండి అది వేరే విషయం.

మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. వల్లభనేని వంశీ గోడెక్కేశాడు. ఎటు దూకాలో తేల్చుకునే పనిలో ఉన్నారు.

ఇక  ఆపద్ధమర్మ ముఖ్యమత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్  సొంత మేనమామ, పార్టీ కమలాపురం అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అయితే తన మేనల్లుడి పార్టీ రాష్ట్రాన్ని గబ్బుపట్టించేసిందని వ్యాఖ్యానించి మొత్తం గాలి తీసేశారు. పోలింగ్ పూర్తయిన తరువాత తాపీగా ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా మనసులో మాట బయటపెట్టేశారు. రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని మీడియాకు చెప్పేసి ఆ తరువాత నాలుక్కరుచుకున్నారు, అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఆయన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయాయి.  స్వయంగా జగన్ మేనమామ రవీంద్రనాధరెడ్డే వైసీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బుపట్టించిందంటూ నిజం కక్కేయడంతో వైసీపీ శ్రేణులలో కాస్తో కూస్తో ఉన్న గెలుపు నమ్మకం పూర్తిగా పోయిందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  

By
en-us Political News

  
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.