అవినాష్ పిటిషన్ సీజే బెంచ్ మీదకు రాకపోవడం వెనుక మర్మం ఏమిటి?..రఘురామకృష్ణం రాజు

Publish Date:Mar 10, 2023

Advertisement

కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ తనను అరెస్టు చేయకుండా సీబీఐను ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు కాకుండా మరో బెంచ్ కు ఎలా వెళ్లిందన్న అనుమానాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు దాఖలు చేసే కేసులన్నీ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించాలన్న విధానానికి విరుద్ధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ మరో బెంచ్ కి వెళ్లడం వెనుక ఏదో మర్మం ఉందని  అనుమానం వ్యక్తం చేశారు.

 గతంలో ఆంధ్ర, తెలంగాణ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ,తాను పిటిషన్ దాఖలు చేయగా అది ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు విచారణకు వెళ్ళిందని ఆయన గుర్తు చేశారు.  అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ లో అత్యవసరంగా కేసు మూవ్ చేయగా, జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ పైకి వెళ్ళింది. రోస్టర్ విధానంలో ఈ కేసు సంబంధిత బెంచ్ పైకి వెళ్లాల్సి ఉండగా, తన బెంచ్ పైకి రావడం పట్ల న్యాయమూర్తి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారన్నారు. అన్నిటికీ మించి తన స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దని అవినాష్ రెడ్డి న్యాయస్థానంలో చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రఘురామ అన్నారు.

 ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేశారని వైయస్ అవినాష్ రెడ్డి కోర్టులో అభియోగం మోపడమేమిటని రఘురామ ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారన్న అభియోగాన్ని మోపాల్సింది సిబిఐ. కోర్టుకు వచ్చి అవినాష్ రెడ్డి అభియోగాన్ని మోపుతున్నారంటే దాని వెనుకనున్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చునని అన్నారు.   వివేక ఇంట్లో అదే రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి చెప్పి రక్తపు మరకలు తుడిచేయమని, కట్లు కట్టమని, సీఐ శంకరయ్యను కూడా మేనేజ్ చేయమని చెప్పారా? అని ప్రశ్నించారు.

దస్తగిరికి హత్య చేయమని వారే చెప్పారని అంటున్న అవినాష్ రెడ్డి ఇంట్లో హత్యకు ముందు, తరువాత దస్తగిరి తో పాటు ఇతర నిందితులంతా ఎందుకు ఉన్నారని నిలదీశారు.  వైఎస్ వివేకా హత్య అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను తుడిపించింది నిజం కాదా?, గాయాలకు కట్లు కట్టించింది నిజం కాదా?, గుండెపోటుతో మరణించారని చెప్పింది వాస్తవం కాదా? రాజశేఖర్ రెడ్డి ఏమైనా తన మామ గుండెపోటుతో మరణించారని చెప్పమని మీకు చెప్పారా? అంటూ ప్రశ్నించారు.

By
en-us Political News

  
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.