వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన జగన్!

Publish Date:May 17, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్’లో  నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఆ నాలుగూ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా వైసీపీ పరం కానున్నాయి. దీంతో వైసీపీలో రాజ్యసభ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం జగన్ రాజ్యసభకు ముగ్గురి పేర్లను ఖరారు చేశారు. మిగిలిన స్థానం విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఒక స్థానాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ భార్య ప్రీతీ అదానీకి కేటాయించాలని భావించినా జగన్ ప్రతిపాదనను గౌతమ్ అదానీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

దీంతో రాజ్యసభకు వైసీపీ తరఫున ఎవరెవరిని పంపాలన్న దానిపై జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి మూడు పేర్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రాజ్యసభకు ఖరారు చేసిన వారిలో బీసీ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి,  ఎస్సీ కోటాలో బీద మస్తాన్ రావు పేర్లను  సీఎం జగన్ దాదాపు ఖరారు చేశారు.  నాలుగో స్థానానికి ప్రస్తుత ఎంపీ విజయసాయిరెడ్డి పేరును పరిశీలస్తున్నట్లు చెబుతున్నారు.

అయతే ఆ విషయం ఇంకా ధృవపడలేదు.  కాగా రాజ్యసభ ఎన్నికల కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.

By
en-us Political News

  
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.