అవినాష్ తీరుతో మంట కలుస్తున్న వైసీపీ ప్రతిష్ట

Publish Date:May 20, 2023

Advertisement

వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో  చేరారు. తల్లి గుండెపోటుతో, కొడుకు కడుపు నొప్పితో ఒకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అవినాష్   ఆస్పత్రిలో చేరాల్సినంత ఆనారోగ్యానికి గురయ్యారంటే ఎవరిదాకానో ఎందుకు ఆయన అనుచరులే నమ్మడం లేదు.

నిన్న ఉదయం నుంచి సాయంత్రం కర్నూలు ఆస్పత్రికి చేరే వరకూ ఆయన ఎంత  యాక్టివ్ గా ఎంత వ్యూహాత్మకంగా హైదరాబాద్ టు పులివెందుల బాట పట్టారో.. సీబీఐ బృందాలు అనుసరిస్తున్నాయని గమనించి పులివెందుల ఆస్పత్రి నుంచి తల్లిని డిశ్చార్జ్ చేయించి ఆమెను అంబులెన్స్ లో తన కాన్వాయ్ కి ఎదురు వచ్చేలా చేసి.. మార్గ మధ్యంలో తాను తల్లి ఉన్న అంబులెన్స్ లోకి మారి కర్నాలు వరకూ వచ్చారు. ఏపీ బోర్డర్ దాటి తెలంగాణలోకి వస్తే అరెస్టు ఖాయం అనుకున్నారో ఏమో కర్నూలులోనే ఆగిపోయి అక్కడి ఆస్పత్రిలో తల్లిని చేర్చారు.

అక్కడి వరకూ ఓకే కానీ కడపు నొప్పంటూ తాను కూడా అదే ఆస్పత్రిలో చేరడంతో అరెస్టు నుంచి తప్పించుకోవడానికే అవినాష్ అలా చేశాడన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి అవినాష్ లో అరెస్టు భయం గత జనవరిలో సీబీఐ తనను విచారణకు పిలిచినప్పటి నుంచీ మొదలైంది. అప్పటి నుంచీ ఆయన అరెస్టును తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించారో , ప్రయత్నిస్తున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. నిజానికి సింపుల్ లాజిక్ ప్రకారం చూస్తే వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని ఇప్పటికే ఆరుసార్లు విచారించింది.

కోర్టులో ఆయన విచారణకు సహకరించడం లేదు కనుక అరెస్టు చేయకతప్పదని విస్పష్టంగా చెప్పింది. అంటే అవినాష్ అరెస్టు అనివార్యం అని అప్పుడే తేలిపోయింది. కోర్టులు కూడా అరెస్టును అడ్డుకుని సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోజాలమంటూ విస్పష్టంగా తేల్చేశాయి. అంటే అవినాష్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, సీబీఐ విచారణకు డుమ్మా కొట్టేందుకు సాకులెన్ని చెప్పినా నేడు కాకపోతే రేపు ఆయన అరెస్టు ఖాయం. ఈ విషయంలో రాజకీయ వర్గాలలోనే కాదు, ఆయన అనుచరులలోనూ, వైసీపీ నాయకులలోనూ కూడా ఎలాంటి అనుమానాలూ లేవు.

అయినా అవినాష్ ఎందుకు సీబీఐకి అందకుండా పరుగులు తీస్తున్నారన్నది అంతు బట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు.  కాగా ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, అవినాష్ కు వరుసకు సోదరుడు అయిన జగన్ ఎందుకు అవినాష్ పిల్ల చేష్టలను అడ్డుకోవడం లేదని కూడా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అవినాష్ తీరు వల్ల ఆయన ప్రతిష్టే కాకుండా వైసీపీ ప్రతిష్ట కూడా మంటగలుస్తోందని అంతర్గత చర్చలలో చెప్పుకుంటున్నారు.

విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ సీబీఐ, సీఐడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్టై 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. పార్టీ అధినేతే ధైర్యంగా కేసులను ఎదుర్కొని అరెస్టై వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ తాను అరెస్టయితే ఇక బయటకు వచ్చేందుకు వీల్లేనంతగా ఇరుక్కుపోతానని భయపడుతున్నారా అని కూడా కడప, పులివెందుల వాసులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అదలా ఉంచితే.. వివేకా హత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చాలా చాలా ఉదారంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఎక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ లేవనెత్తిన అంశాలన్నిటినీ కూడా పరిగణనలోనికి తీసుకుని వాటినై సైతం దర్యాప్తు చేసింది. ఆయన ఆరోపించిన వారందరినీ పిలిపించుకుని విచారించింది. ఆ తరువాత కూడా సీబీఐ అవినాష్ వెంట పడుతోందంటే ఈ కేసులో అవినాష్ ప్రమేయానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలేవో  సీబీఐ సేకరించిందనే భావించాల్సి వస్తోంది. సాధారణంగా ఏ దర్యాప్తు సంస్థ అయినా ఎక్యూజ్డ్ ఆరోపణలను పట్టించుకోదు. కానీ హై ప్రొఫైల్ కేసు కావడంతో వివేకా హత్య కేసులో సీబీఐ అన్ని అంశాలలోనూ ఆచితూచి వ్యవహరించింది. అవినాష్ కు  ఆయన కోరినన్ని అవకాశాలిచ్చింది. చివరి నిముషంలో విచారణకు డుమ్మా కొట్టి మరో  రోజు వస్తామని చెప్పినా అంగీకరించింది. విచారణకు హాజరై సీబీఐ కార్యాలయం ఎదుటే సీబీఐపై నిందలు మోపినా సహించింది.

ఇక అవినాష్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి అని తేలిపోయిన తరువాత కూడా ఆయన ఆడుతున్న దాగుడు మూతలు  ఆయననే కాకుండా పార్టీనీ, పార్టీ అధినేత జగన్ నూ అపహాస్యం చేసేవిధంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రక్రియకు  ఫుల్ స్టాప్ పెట్టి అవినాష్ సీబీఐ విచారణకు హాజరైతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారకుండా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.