రజనీకాంత్ పై విమర్శలతో వైసీపీ ప్రతిష్ట పాతాళానికి

Publish Date:May 1, 2023

Advertisement

రజనీ కాంత్ పై వైసీపీ విమర్శలపై సహజంగానే దేశ వ్యాప్తంగా తీవ్ర  ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రజనీకాంత్ కు ఏపీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. ఈ డిమాండ్ ఏదో తమిళుల నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో కాదు.. దేశం నలుమూలల నుంచీ వినవస్తోంది. సమాజాక మాధ్యమం అయితే.. వైసీపీ ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతోందనీ, ఆ మాటల్లో విమర్శల్లో వైసీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ ప్రస్ఫుటంగా బయటపడుతోందనీ సామాజిక మాధ్యమంలో విస్తృత చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవంలో పాల్గొనేందుకు బెజవాడ వచ్చిన రజనీ కాంత్ తన ప్రసంగం మొత్తంలో ఎక్కడా వైసీపీ పేరు కానీ, జగన్ మాట కానీ ఎత్తలేదనీ, కేవలం చంద్రబాబు విజన్ ను, ఎన్టీఆర్ ఔన్నత్యాన్నీ మాత్రమే ప్రశంసించారనీ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు విజన్ గురించి రజనీకాంత్ ప్రస్తావించడంతోనే వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా వైసీపీ నేతలు గాభరా పడటం వారిలోని భయాన్ని ఎత్తి చూపిందని అంటున్నారు. 2024 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించి సీఎం అయితే ఏపీ నంబర్ వన్ అవుతుందన్నది ఒక్క రజనీకాంత్ అభిప్రాయం మాత్రమే కాదనీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా అదే అభిప్రాయంతో ఉన్నారనీ అంటున్నారు.

అంతెందుకు ప్రభుత్వ విజయాలను బాకా ఊదుకోవడానికి గడప గడపకూ అంటూ వెళుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎదురౌతున్న ప్రజా వ్యతిరేకత, నరసనల సెగలే.. జగన్ పాలన ఎంత సుందరముదనష్టంగా సాగుతోందో అర్దమైపోతోందని నెటిజన్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అంతెందుకు జగన్ ప్రసంగాలకు, పథకాలకు, సొమ్ముల పందేరాననికీ జనం చప్పట్లు కొట్టడం లేదంటూ సీనియర్ వైసీపీ నేత.. మంత్రి ధర్మాన జనంపైనే చిర్రుబుర్రులాడటంతోనే వైసీపీ పాలన పట్ల, జగన్ తీరు పట్ల సొంత పార్టీలోనే.. ఎంత అసహనం వ్యతిరేకత ఉందో అర్థమౌతోందని అంటున్నారు.

అధికారం చేజారిపోతోందన్న ఆందోళన వైసీపీ నేతలలో అసహనానికీ, ఫ్రస్ట్రేషన్ కు కారణమౌతోందని, దాంతోనే  విచక్షణ మరచి ఎవరిని పడితే వారిని, ఎలా పడితే అలా విమర్శస్తూ తమ వాచాలతను ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతల ఈ తీరు వారి ప్రతిష్టను, పార్టీ పరువును మరింత దిగజారు స్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.