వైసీపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించేసిందా. ఒక వైపు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం విఫలం కావడం, మంత్రుల బస్సు యాత్ర తుస్సు మనడం.. మరో వైపు తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి జన స్పందన బ్రహ్మాండంగా ఉండటం, తెలుగుదేశం మహానాడు అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఏపీలో అధికార వైసీపీకి ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో ప్రజలలో తమ పట్టు సడలలేదని నిరూపించుకోవడానికి నానా తంటాలూ పడుతోంది.
క్రమశిక్షణా సంఘం సిఫారసు అంటూ మాజీ మంత్రి కొత్తపల్లిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదన్న సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చింది. అయితే ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించుకోకుంటే.. పార్టీ నుంచి వలసనలు పెరుగుతాయన్న భయం మాత్రం పార్టీని వెంటాడుతోంది. దీంతో పార్టీ ప్లీనరీ నిర్వహించి సత్తా చాటాలని, తద్వారా ముందస్తు సన్నాహాలు ప్రారంభించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు.
ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసేశారు. వైస్ జయంతి రోజైన జూలై 8 నుంచి రెండు రోజుల పాటు వైసీసీ ప్లీనరీ నిర్వహించాలని జగన్ నిర్వహించారు. 2017లో వైసీపీ ప్లీనరీ నిర్వహించిన గుంటూరు జిల్లాలో నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలోనే ఈ సారి కూడా ప్లీనరీ నిర్వహణకు జగన్ నిర్ణయించారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం మహానాడును మించి వైసీపీ ప్లీనరీ విజయివంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.
జన సమీకరణ విషయంలో ఎటువంటి రాజీ వద్దనీ, పెద్ద సంఖ్యలో జనం ప్లీనరీకి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వైసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్లీనరీ నిర్వహణకు కమిటీల ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జలకు అప్పగించారు. వచ్చే మూడు నాలుగు రోజులలో ప్లీనరీ కమిటీల ఏర్పాటు జరుగుతుందని సజ్జల జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ సభలకు జనం రావడం లేదన్న ప్రచారానికి ప్లీనరీతో ఫుల్ స్టాప్ పడేలా జనసమీకరణ ఉండాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్లీనరీతో వైసీపీకి జనంలో అభిమానం చెక్కు చెదరలేదని చాటాలని జగన్ ముఖ్యనేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-plenary--a-dign-to-early-elections-25-136853.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్