బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్‌.. జ‌గ‌న్ ప‌రువు తీసిన ష‌ర్మిల

Publish Date:Apr 9, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ నేత‌ల‌ ప్ర‌చారం పీక్ కు చేరింది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అధికార వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు ప‌డిపోతోంది. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లు కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యంకోసం విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వారి స‌భ‌ల‌కు ప్ర‌జాద‌ర‌ణ భారీగా ల‌భిస్తోంది.

మ‌రో వైపు పలు స‌ర్వేలు కూట‌మిదే అధికార‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నాయి. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌ను స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. దీంతో వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యం గూడుకట్టుకుంది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే  వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సొంత చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్‌ ష‌ర్మిల రూపంలో భ‌యం వెంటాడుతోంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో బాహాటంగానే చర్చ జరుగుతోంది. వివేకా హ‌త్య‌ కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అని వైఎస్ ష‌ర్మిల‌, సునీతా రెడ్డిలు చెబుతున్నారు. సీబీఐ విచార‌ణలోనూ అవినాశ్ రెడ్డి ప్ర‌ధాన నిందితుడ‌ని తేలింది. అయినా అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారాన్ని ఉప‌యోగిస్తున్నాకని ష‌ర్మిల, సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు అవినాశ్ కు మ‌రోసారి క‌డ‌ప ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై జ‌గ‌న్ చెల్లెళ్లు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే అవినాశ్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా వైఎస్ ష‌ర్మిల బ‌రిలోకి దిగారు. 

వైఎస్ ష‌ర్మిల ఈనెల 5  నుంచి క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలో విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ష‌ర్మిల‌కు మద్దతుగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిద్ద‌రూ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌ స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా వివేకా హ‌త్య వ్య‌హారాన్ని ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌, అవినాశ్ రెడ్డిల‌ను ఏకిపారేస్తున్నారు. ష‌ర్మిల దూకుడుతో క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజకవర్గ ప‌రిధిలోని  వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది.  ష‌ర్మిల ప‌దునైన మాట‌ల‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేస్తుండ‌టంతో ష‌ర్మిల‌ను నిలువ‌రించ‌డం ఎలా అనే ఆలోచ‌న‌లో వైసీపీ నేత‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ ష‌ర్మిల పాల్గొనే స‌భ‌ల‌ను అడ్డుకొనే ప్ర‌య‌త్నాలను వైసీపీ ఆరంభించింది.  ఇప్ప‌టికే వివేకా హ‌త్య‌కేసు విష‌యంలో క‌డ‌ప‌లో వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డ‌గా,  ఇప్పుడు ష‌ర్మిల స‌భ‌ల‌ను అడ్డుకుంటే ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగి మరింత ఇబ్బంది ఎదురవుతుందని వైసీపీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే, ష‌ర్మిల దూకుడుకు క‌ళ్లెం వేయ‌డం ఎలా అనే చ‌ర్చ వైసీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే జగన్ వ్యూహాత్మకంగా ష‌ర్మిల స‌భ‌ల‌కు కొంద‌రు వైసీపీ ద్వితీయ స్థాయి నేత‌లను పంపిస్తున్నారు. వారు ష‌ర్మిల మాట్లాడే స‌మ‌యంలో జై జ‌గ‌న్,  జైజై జ‌గ‌న్‌ అనే నినాదాలు చేస్తూ స‌భ‌లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తేలా చేస్తున్నారు. దానిని తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ష‌ర్మిల స‌భ‌ల్లో  జై జ‌గ‌న్   నినాదాలు వినిపిస్తున్నాయి, ష‌ర్మిల‌కు క‌డ‌ప ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నదంటూ ప్ర‌చారం చేసుకోవాలని ప్లాన్ చేశారు. 

అయితే జగన్, వైసీపీ నేత‌ల చిల్ల‌ర చేష్ట‌ల‌ను ప‌సిగ‌ట్టిన వైఎస్ ష‌ర్మిల వారికి త‌గిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. సోమ‌వారం(ఏప్రిల్ 8) క‌డ‌ప జిల్లా దువ్వూరులో ష‌ర్మిల ప్ర‌చారం నిర్వ‌హించారు. అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ష‌ర్మిల మాట్లాడుతుండ‌గా  జై జ‌గ‌న్ అంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు నినాదాలు చేశారు. వైసీపీ నేత‌ల కుట్ర‌ల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టిన ష‌ర్మిల‌   వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మాట్లాడేందుకు ఆహ్వానించారు. ద‌మ్ముంటే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడండి.. మీ జ‌గ‌న‌న్న ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పండి చూద్దాం అంటూ సూచించారు. వైసీపీ నేత‌ ష‌ర్మిల వ‌ద్ద‌కు వ‌చ్చి మైక్ అందుకొని జ‌గ‌న్ గురించి మాట్లాడాడు. ఆయ‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్ ఏం అభివృద్ధి చేశాడో చెప్ప‌కుండా.. కేవ‌లం జ‌గ‌న‌న్న అంటేమాకు అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు. అనంత‌రం ష‌ర్మిల మైక్ అందుకొని.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఒకప్పుడు నేను జై జ‌గ‌న్ అన్నా.. ఆయ‌న జైలుకెళ్తే 3,200 కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసి పార్టీని నిల‌బెట్టా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా పాల‌న చేస్తారని అనుకున్నా.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారు. సొంత బాబాయ్ హ‌త్య‌కు కారుకుల‌ను ప‌క్క‌న పెట్టుకొని ఎంపీ టికెట్ ఇచ్చాడు.. అస‌లు జ‌గ‌న్ వైఎస్ వార‌సుడే కాదు,  అస‌లైన వైఎస్ వార‌సురాలిని నేనే అంటూ వైసీపీ నేత‌ల‌కు  దిమ్మ‌తిరిగే షాకిచ్చారు ష‌ర్మిల. 

రాయ‌ల‌సీమ జిల్లాల్లో వైసీపీకి బ‌లం ఎక్కువ‌. ఆ ప్రాంతంలో 52 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.  2014, 2019 ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ ప్రాంతంలో వైసీపీ హ‌వా కొన‌సాగింది. కానీ, ఈసారి ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కూట‌మి బ‌ల‌ప‌డ‌టంతోపాటు వైఎస్ ష‌ర్మిల రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి షాక్ త‌గిలే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో నిందితుడుగా ద‌ర్యాప్తు సంస్థ‌లు పేర్కొన్న అవినాశ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వ‌డంపై ష‌ర్మిల‌తో పాటు ఉమ్మ‌డి క‌డ‌ప  జిల్లాలోని అధిక శాతం మంది ప్ర‌జ‌ల నుంచి  వ్య‌తిరేక‌త వ్య‌క్తవుతుంది. ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తుండ‌టంతో పాటు, అస‌లైన వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి వార‌సురాలు తానేనని ఆమె ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌గ‌లుగుతున్నారు. ఒక ప‌క్క కూట‌మి దెబ్బ‌తోపాటు ష‌ర్మిల ఎఫెక్ట్ కూడా రాయ‌ల‌సీమ ప్రాంతంలో వైసీపీ అభ్య‌ర్థుల‌ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసే పరిస్థితి ఉంద‌ని జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం.  దీంతో వైఎస్ ష‌ర్మిల దూకుడుకు ఎలా అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ పెద్ద‌లు త‌ల‌మున‌క‌ల‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ ష‌ర్మిల దూకుడుతో ఉమ్మ‌డి క‌డ‌ప  జిల్లాలోని వైసీపీ అభ్య‌ర్థుల్లో ఓట‌మి భ‌యం మొద‌లైంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది.

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.