Publish Date:Mar 31, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం అమరావతి. ఈ విషయంలో వైఎసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట. అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు.
ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది.
మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-on-the-brink-of-a-split-25-216464.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?