Publish Date:May 13, 2025
ఏపీ లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మథున్ రెడ్డి నిండా ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టుకు రిఫర్ చేసింది. అయితే అరెస్టు నుంచి మాత్రం రక్షణ కల్పించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం హైకోర్టు మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై నిర్ణయం తీసుకునే వరకూ అరెస్టు చేయబోమని కోర్టులకు తెలిపి మిథన్ రెడ్డికి ఊరట కలిగించింది. విషయం ఏమిటంటే.. మద్యం కుంభకోణం కేసులో గతంలో హైకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిలు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే అప్పటికి మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం.. ఆయనను అరెస్టు చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడంతో హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. దీంతో మెరిట్స్ ఆధారంగా మరోసారి మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై నిర్ణయం తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు సూచించింది. అదే సమయంలో గతంలో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి ఇచ్చిన షీల్డ్ ను తొలగించింది. కానీ బెయిల్ పై హైకోర్టు తీర్పు ఇచ్చేంతవరకూ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సుప్రీం కోర్టు హైకోర్టుకు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నాలుగు వారాలలోగా విచారణ చేపట్టాలని గడువు విధించింది. అంటే ఏపీ ప్రభుత్వం మిధున్ రెడ్డిని మరో నాలుగు వారాల వరకూ అరెస్టు చేయకుండా భారీ ఊరట కల్పించిందని చెప్పాలి.
ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలుపై ఏపీ హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారనీ, మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారనీ దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ వరుసగా అరెస్టులు చేస్తుండటంతో మిథున్ రెడ్డి కూడా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా ఉండగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంలో స్వల్ప ఊరట లభించింది. వారి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం వరకూ వారిరువురినీ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-mp-mithunreddy-gets-respite-from-ap-government-25-197995.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.