ఒక్క ఎంపీ సీటు.. నాలుగు వికెట్లు.. జగన్ కు మామూలు దెబ్బ కాదుగా!

Publish Date:Jan 23, 2024

Advertisement

వైసీపీ టీమ్ ఆలౌట్ కు దగ్గరౌతోందా? ఒక దాని వెంట ఒకటిగా వికెట్లు పడిపోతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తాజాగా నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా చేశారు. ఆయన తన ఎంపీ పదవికీ, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ కూడా రాజీనామా చేశారు. 
ఒక్క గుంటూరు లోక్ సభ స్థానం కేంద్రంగా వైసీపీ నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఇప్పటికే రెండు వికెట్ల పడిపోయాయి. ఇహనో ఇప్పుడో మరో రెండు వికెట్లు కూడా డౌన్ కానున్నాయి. ఇంతకీ గుంటూరు లోక్ సభ స్థానం విషయంలో జగన్ నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం నలుగురు రాజీనామాకు ఎందుకు కారణమైంది. అంటే జగన్ తన ఇష్టారీతిగా ఆశావహులకు హామీలు ఇచ్చేయడం, ఆ తరువాత తూచ్ ఇది కాదు.. మరోటి అంటూ నిర్ణయాన్ని మార్చేసుకోవడం పరిపాటే. ఇంత వరకూ ఎలాగో గడిచిపోయింది కానీ ఎన్నికల ముందు.. జగన్ నిర్ణయాలు తమ కొంపలు ముంచేసే విధంగా ఉండటంతో ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమంటూ పలువురు పార్టీని వీడుతున్నారు. అదే విధంగా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టికెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చి క్రికెటర్ అంబటి రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు. నిజమే కాబోలనుకున్న అంబటి రాయుడు ఓ మూడు నెలల పాటు నియోజకవర్గం అంతా పర్యటించి పరిచయాలు పెంచుకుని మద్దతు కూడగట్టుకుని అంతా బానే ఉందన్న నిర్ణయానికి వచ్చి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని కండువా కప్పుకున్నారు. అంత వరకూ గుంటూరు లోక్ సభకు వైసీపీ అభ్యర్థిని తానే అనే భవనలో ఉన్న రాయుడికి ఆ సీటు నుంచి పోటీ చేయాల్సిందిగా నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయులిని జగన్ ఆదేశించినట్లు తెలియడంతో బిత్తర పోయారు. పార్టీ అధినేత ఇలా మాట ఇచ్చి అలా తప్పడానికి సిద్ధపడిపోవడంతో ఇహ లాభం లేదని నిర్ణయానికి వచ్చేశారు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ తీర్థం పుచ్చుకున్న పది రోజుల్లోనే రాజీనామా చేసేశారు. జనసేన గూటికి చేరిపోయారు.

ఇక లావు కృష్ణ దేవరాయులు విషయానికి వస్తే ఆయన జగన్ కు ముఖం మీదే తాను గుంటూరు నుంచి పోటీకి సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టేశారు. గుంటూరులో తాను కాదు, వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కూడా మొహమాటం లేకుండా చెప్పేశారు. తాను నరసరావు పేట నుంచే బరిలోకి దిగుతానని తెగేసి చెప్పారు. అప్పటికి సరే అన్న జగన్.. తన మాట కాదంటాడా అన్న అహంతో లావుకు నరసరావు పేట ఎంపీ టికెట్ ఖరారు చేయలేదు. దీంతో ఓ పది రోజులు ఓపిక పట్టిన లావు రెండో ఆలోచన లేకుండా రాజీనామా చేసేశారు.

ఆ సందర్భంగా ఆయన నేరుగా జగన్ పేరు ప్రస్తావించకుండానే పార్టీ పరిస్థితిని, పార్టీ అగ్రనాయకత్వం అడ్డగోలు వ్యవహారాన్నీ మీడియాకు సవివరంగా చెప్పేశారు.  పార్టీలో గత కొంత కాలంగా  అయోమయం నెలకొందనీ,  దానికి పార్టీ అధిష్ఠానం తెరదించుతుందన్న ఇంత కాలం వేచి ఉన్నాననీ, ఆ పని హైకమాండ్ చేయకపోవడంతో తాను ముందుకు వచ్చి తన రాజీనామాతో తెరదించాలని భావించాననీ చెప్పారు. 
 గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. అందుకే తాను రాజీనామా చేశాననీ చెప్పారు.  

అయితే గుంటూరు లోక్ సభ స్థానం సెంట్రిక్ గా ఈ రెండు వికెట్ల పతనంతో ఆగేటట్లు కనిపించడం లేదు. నరసరావు పేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అలాగే  నర్సరావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా బాటలోనే ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. తొలి నుంచీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు గట్టి మద్దతుదారులుగా ఉన్న వీరిరువురూ లావు రాజీనామా చేసిన వెంటనే ఆయనతో భేటీ అయ్యారు.  త్వరలోనే వారూ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జగన్ సిట్టింగుల మార్పు ప్రయోగం.. గట్టిగానే ఫలిస్తున్నట్లు తోస్తున్నది. కొందరు మంత్రులు, సీనియర్ నేతలూ కూడా సమయం చూసుకుని వైసీపీకి గుడ్ బై కొట్టేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.