కేంద్ర వ్యవసాయ మంత్రి జేపీ నడ్డాట.. వైసీపీ ఎంపీ అజ్ణానానికి ఇంత కంటే ఆధారం కావాలా?
Publish Date:Aug 20, 2025
Advertisement
వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలన్న అత్యుత్సాహంతో తప్పులో కాలేశారు. తన అజ్ణానాన్నా తానే బయటపెట్టుకున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ కు, తెలుగుదేశం శ్రేణుల ఎద్దేవాలకు గురౌతున్నారు. ఎంపి అయి ఉండి కూడా కేంద్రంలో ఏ మంత్రిది ఏ శాఖ అన్నది కూడా అవగాహన లేదని ఎంపీ తన విమర్శలతో తనను తానే పలుచన చేసుకున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందంటూ వైసీపీ ఎంపి మద్దిల గురుమూర్తి పెట్టిన ఒక పోస్టు ఎంపి అజ్ణానాన్ని బట్టబయలు చేయడమే కాకుండా వైసీపీని కూడా నవ్వుల పాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో యూరిగా కొరత కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేసిన వైసీపీ ఎంపీ గురుమూర్తి అక్కడితో ఆగకుండా.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతుల ఇబ్బందులను తాను స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లాననీ, ఆయన సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారనీ పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఆయన అవగాహనారాహిత్యం, అజ్ణానం ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. ఏలా అంటే జేపీ నడ్డా వ్యవసాయ మంత్రి కాదు. ఆయన నిర్వహిస్తున్న శాఖ కేంద్ర రసాయనాలు, ఎరువులు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ గురుమూర్తిని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు అయితే అసలు గురుమూర్తి నిజంగా కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర సమస్య గురించి ప్రస్తావించారా? అలా ప్రస్తావించి ఉంటే తాను ఏ శాఖ మంత్రిని కలిశారో కూడా అవగాహన లేకుండానే కలిశారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-mp-gurumurty-ignorence-39-204677.html





