మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి

Publish Date:Jun 2, 2022

Advertisement

వైసీపీ నేతలు వివాదాలను ఆహ్వానిస్తారో.. లేక వివాదాలే వారిని వెతుక్కుంటూ వస్తాయో అర్ధం కాదు కానీ, ఏపీలో అధికార పార్టీ నేతలు తరచూ వివాదాలతో సహవాసం చేస్తుంటారనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. తాజాగా  రాజానగరం ఎమ్మెల్యే జక్కపూడి రాజా వివాదంలో ఇరుక్కున్నారు. వివాదాలు ఆయనకు కొత్తకాదు. రాజమహేంద్రవరం ఎంపి భరత్ తో విభేదాలతో చాలా కాలం ఆయన వివాదాలతో సహవాసం చేశారు. వారిరువురి మధ్యా విభేదాలు ఇప్పుడు సద్దుమణిగాయి అది వేరే సంగతి. విపక్షంలో ఉన్న సమయంలో కూడా జక్కంపూడి రాజా ప్రభుత్వోద్యోగిపై చేయి చేసుకున్నారు. అలాగే కొద్ది కాలం కిందట సీతానగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ  అధ్యాపకుడిపై దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఇక తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఏఈఈ) సూర్యకిరణ్ పై చేయి చేసుకుని మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. తనపై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి చేయి చేసుకున్నట్లు సూర్యకిరణ్  రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబధించి రంగంపేట పరిధిలోని పుష్కర కాలువ పూడిక తీత పనుల బిల్లులకు సంబంధించి జక్కంపూడి రాజా జలవనరుల శాఖ సమీక్షా సమావేశంలో ప్రశ్నించారు.

సూర్యకిరణ్ వివరణ ఇస్తుండగానే జక్కంపూడి ఆయనపై దాడి చేసి చేయి చేసుకున్నారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా వారెవరూ అడ్డుకోలేదు. నోరు మెదప లేదు. 
కాగా సూర్యకిరణ్ రాజమహేంద్ర వరం త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెబుతుంటే.. త్రీ టౌన్ సీఐ మాత్రం జక్కంపూడిపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని అంటున్నారు.

ఇలా ఉండగా సూర్యకిరణ్ పై దాడికి నిరసనగా శుక్రవారం భోజన విరామ సమయంలో ధవళేశ్వరం జల వనరుల కార్యాలయం వద్ద  ఆ శాఖ ఏఈలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జక్కంపూడి తరచూ వివాదాలలో నిలుస్తుండటం పార్టీ ప్రతిష్టను మసకబారుస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి.   అధికారం ఉందన్న అహంకారంతో.. పోలీసుల అండతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని తెలుగుదేశం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నది.  ఏఈఈపై చర్య తీసుకున్న జక్కంపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. ఫిర్యాదు చేసినా అందలేదంటూ సీఐ చెప్పడాన్ని తప్పుపట్టింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయిందనడానికి సూర్యకిరణ్ పై దాడి ఒక నిదర్శనం అని పేర్కొంది.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.