నామినేటెడ్ పదవి కోసం వైసీపీ ఎమ్మెల్యే రూ. 5.5 కోట్ల డీల్.. జడ్పీటీసీ పేరుతో లేఖ వైరల్ 

Publish Date:Nov 2, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం అవినీతి ,అక్రమాలకు కేరాఫ్ గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఏ పని జరగాలన్న అధికారులకు, స్థానిక వైసీపీ నేతలకు ఎంతో కొంత ఇస్తే కాని పని జరగదనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. మైనింగ్, సాండ్, లిక్కర్.. ఇలా అన్ని అంశాల్లోనూ కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు కూడా వచ్చాయి. తాజాగా తమ పార్టీ కార్యకర్తలను కూడా పదవుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు లంచం అడగడం కలకలం రేపుతోంది. 

నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రూ. 5.5 కోట్లు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లేఖ చక్కర్లు కొడుతోంది. ఐరాల జడ్పీటీసీ సభ్యురాలు వి.సుచిత్ర సీఎం జగన్‌కు ఈ లేఖ రాసినట్టుగా ఉంది. తనకు జడ్పీ వైస్ చైర్మన్ పదవిని కానీ, లేదంటే ఆర్టీసీ చైర్మన్ అదీ కుదరకుంటే వైసీపీ కుప్పం నియోజకవర్గ బాధ్యురాలిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తన నుంచి రూ. 5.5 కోట్లు తీసుకున్నారని సుచిత్ర ఆ లేఖలో పేర్కొన్నట్టుగా ఉంది. 

అయితే ఎమ్మెల్యే హామీలేవీ నెరవేరకపోవడంతో తిరిగి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరానని లేఖలో జడ్పీటీసీ సభ్యురాలు కోరినట్లుగా ఉంది. బెంగళూరు వస్తే ఇస్తానని చెబితే అక్కడికి వెళ్తే బెదిరించారని, అంతేకాక, తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానన్నారని వాపోయారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని హెచ్చరించారని పేర్కొన్నారు. ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని, కాబట్టి మీరే (జగన్) కాపాడాలని కోరినట్టుగా ఆ లేఖలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్పందించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపడేసిన ఎమ్మెల్యే.. అంతా దేవుడే చూసుకుంటాడని అన్నారు.

By
en-us Political News

  
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.