వైసీపీ మంత్రులకు ఎదురుగాలి?.. 60 నియోజకవర్గాలలో వైసీపీ ఓటమి ఖరారేనా?

Publish Date:Dec 19, 2022

Advertisement

వైసీపీ మంత్రులకు రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తోంది. జగన్ సర్కార్ తీవ్ర మైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలువురు మంత్రులు తమ తమ నియోజకవర్గాలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. తమ తమ నియోజకవర్గాలలో వారికి ప్రజాదరణ కరవైందని తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం తమ తమ నియోజకవర్గాలలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మంత్రులలో రోజా, విడదల రజని,  ఉషశ్రీ చరణ్ , గుడివాడ అమర్నాథ్,  సిదిరి అప్పలరాజు, జోగి రమేష్, శంకర్ నారాయణ,  మెరుగు నాగార్జున ఉన్నారు.

ఒక్క చాన్స్ అంటూ రాష్ట్రమంతా నడిచి  వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. నిజమే.. అఖండ మెజారిటీతో ఆయన ఒంటి చేత్తో పార్టీకి అధికారాన్ని సముపార్జించి పెట్టారు.  అయితే ఈ మూడున్నరేళ్లలో జగన్ కు ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబు  అని జనం వగచేలా ఆయన పాలన ఉంది.    రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో అది మూడు శాతానికి పడిపోయింది.   నిజానికి, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు. అందుకే, ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు జపం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న  పర్యటనలకు లభిస్తున్న ఆదరణ చూస్తే, జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో,  అర్థమవుతుంది. జగన్ పార్టీ విజయావకాశాలపై ఇటీవలి కాలంలో వచ్చిన సర్వేలన్నీ ఒకే మాట చెప్పాయి. ఆయన గ్రాఫ్ అతి వేగంగా పడిపోతోందని.  కాగా తాజాగా శ్రీ ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో కనీసంలో కనీసం 60 స్థానాలలో వైసీపీ అత్యంత బలహీనంగా ఉందని.. అంటే 175 అవుటాఫ్ 175 అంటున్న జగన్ పార్టీ ఎన్నికలు జరగడానికి ముందే కనీసం 60కి పైగా స్థానాలలో వైసీపీ విజయం కోసం ఎదురీదక తప్పని పరిస్థితులు ఉన్నాయని శ్రీ ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది. 

 రాష్ట్రంలోని 70 వరకూ నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, మంత్రులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని  శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. ఆయా   నియోజకవర్గాలలో మంత్రి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం,  మరో మంత్రి విడదల రజని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరి పేట నియోజకవర్గం, మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గం కూడా ఉన్నాయి. కూడా ఉండటం గమనార్హం.  ఇక పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు, అలాగే విజయనగరం జిల్లా శృంగవరపు కోట, విజయనగరం, బొబ్బిలి, కురుపాంలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, అనకాపల్లి, అరకు, పాయకరావు పేల, గాజువాక నియోజవర్గాలలో వైకాపీ అత్యంత బలహీనంగా ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పిఠాపురం, పి.గన్నవరం, అమలాపురం, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, ఉండి, నిడదవోలు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాలలో వైపీపీ పరిస్థితి ఎదురీతగానే ఉందని సర్వే వెల్లడించింది.

అలాగే కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని జిల్లా పరిధిలోని విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామ, పెడనలలోనూ, గుంటూరు జిల్లాలోని తాడి కొండ, వినుకొండ, చిలకలూరి పేట, తెనాలి, బాపట్ల, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, వేమూరు, పొన్నూరులలో వైసీపీ తీవ్ర మైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

ఇక ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జల్లాలోని సంత నూతల పాడు, కనిగిరి, పరుచూరు, అద్దంకి, దర్శిలలోనూ, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ, కావలి, గూడూరు, ఉదయగిరిలలోనూ వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో కూడా మైదుకూరు, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, కల్యాణ దుర్గం నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. అదే విధంగా కర్నూలుజల్లాలో కూడా కర్నూలు, నంది కొట్కూరు, పత్తికొండ, పాణ్యం, ఆలూరులలోనూ, చిత్తూరు జిల్లా నగరి, సత్యవేడు, పుతలపట్టు, పలమనేరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తున్నది. 

ముఖ్యమంత్రి జగన్ సహా అధికార పార్టీ నాయకుల సభలు జనంలేక వెలవెలబోవడం, అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు సహా ఆ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టడంతో రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సర్వే కూడా ఆ విశ్లేషణలకు బలం చేకూర్చేదిగానే ఉంది.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.