వైసీపీ ఫ్రాడ్ బ్రాండ్స్!

Publish Date:Dec 1, 2025

Advertisement

వైసీపీ ఒక క్రిమిన‌ల్ గ్యాంగ్ అని చెప్ప‌డానికి ఇప్ప‌టికే ఆ పార్టీ అధినేత నుంచి ర‌ప్పా  ర‌ప్పా ఫ్లెక్సీలు ప‌ట్టుకు తిరిగే కేడ‌ర్ వ‌ర‌కూ అందరూ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్న రీతిలో రుజువు చేసేశారు. జగన్ ఆస్తుల కేసులలో, ఆ పార్టీ నేతలు ఏపీ మద్యంస్కాం, కల్తీమద్యం కుంభకోణం, భూ కబ్జాలు వంటి ఎన్నో నేరాలలో కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు కటకటాల వెనుక ఉన్నారు. ఇది చాలు  ఆ పార్టీ ఒక క్రిమినల్స్ గ్యాంగ్ అని చెప్పడానికి అంటున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.   ఇప్పుడు తాజాగా వైసీపీలో   లేడీ  డాన్స్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వస్తోందంటున్నారు.  మొన్నటికి మొన్న నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్య‌వ‌హారం. ఇప్పుడు తాజాగా అదే నెల్లూరు జిల్లాకు, చెందిన అర‌వ కామాక్షి కేసు. అరవ కామాక్షి అయితే  ఏకంగా గంజాయి దందా నిర్వ‌హిస్తూన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  

అర‌వ కామాక్షి చేసే గంజాయి దందాను  అరిక‌ట్టాల‌ని పోరాటం చేస్తున్న    పెంచల‌య్య‌ అనే వ్యక్తిని వెంటాడి, వేటాడి మరీ హత్య చేసింది కామాక్షి గ్యాంగ్ అని పెంచలయ్య హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. త‌న గంజాయి దందాకు  పెంచ‌ల‌య్య‌ ఆడ్డు వ‌స్తున్నాడ‌న్న కారణంగా  అత‌డ్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న కామాక్షి గ్యాంగ్ చివరకు పెంచలయ్య త‌న బిడ్డ‌ను స్కూలు నుంచి తీసుకొస్తుండ‌గా  కాపు కాచి మరీ ఖతం చేశారని చెబుతున్నారు.  

ఈ హత్య ఘటనను కూడా వైసీపీయులు రాజకీయ ప్రత్యర్థులపై నెట్టేయడానికి ప్రయత్నించారు. దీనిపై  రియాక్టైన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. ఒక వేళ నాపై సీపీఏం  నేత‌లు కేసు పెడితే తాను వారు విధించే శిక్ష‌ను ఎదుర్కుంటాన‌న్నారు. వాస్తవానికి   అర‌వ కామాక్షికి ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి వ‌ర్గానికి  ఎంతో సంబంధ‌ముంద‌ని ఆరోపించారాయ‌న‌.  ఇటీవల  జ‌గ‌న్ నెల్లూరు వ‌చ్చిన‌పుడు ఇదే అర‌వ కామాక్షి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు  ఖ‌ర్చుల కోసం ఇచ్చింది నిజం కాదా?  అని ప్రశ్నించారు. ఆమెకూ వైసీపీ నేత‌ల‌కు అంత‌టి సంబంధ బాంధ‌వ్యాలున్నాయి కనుకే..   విజ‌య్ కుమార్ రెడ్డి, పెంచ‌ల‌య్య కుటుంబాన్ని  ప‌ర‌మార్శించ‌డానికి రాలేద‌న్నారు కోటంరెడ్డి.

ఇదంతా ఇలా ఉంటే వైసీపీ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడే గ్యాంగ్ ను తయారు చేసిందనీ, అది చాలదన్నట్లు ఇప్పుడు ఒక అరుణ‌, ఒక అర‌వ కామాక్షి వంటి ఫ్రాడ్ బ్రాండ్స్ ని కూడా రంగంలోకి దింపిందనీ విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  

By
en-us Political News

  
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
ఈ కేసులో తాను టార్గెట్ అయ్యాన‌న్నారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని, ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.