అత్యుత్సాహంతో వైసీపీ బొక్క‌బోర్లా.. పాయె..ప‌రువు మొత్తం పాయే!

Publish Date:Jan 21, 2025

Advertisement

దొర‌క్క దొర‌క్క కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే త‌ర‌హాలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు నానా హ‌డావుడి చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత వైసీపీ నేత‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ‌ హ‌డావుడి చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ఏడు నెల‌ల కాలంలో కూట‌మి పార్టీల మ‌ధ్య ఎక్క‌డా విబేధాలు పొడ‌ చూప‌లేదు. ఐక‌మ‌త్యంగా క‌లిసి రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా ఎలాంటి అంశం, అవకాశం దొర‌క‌డం లేదు. అయితే, గ‌త నాలుగు రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను నియ‌మించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. ప‌లువురు తెలుగుదేశం నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో కూట‌మి నేత‌ల మ‌ధ్య ఎలా అగ్గిరాజేయాలా అని  గోతికాడ  న‌క్క‌లా ఎదురుచూస్తున్న వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక రాబోతోంది.. ప్ర‌భుత్వం కూల‌బోతోంది అంటూ తెగ హ‌డావుడి చేశారు. అంతే కాదు.. కూట‌మి నేత‌లు మాట్లాడ‌ని మాట‌ల‌ను జోడించి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య గొడ‌వ‌ పెట్టేలా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా తీవ్రంగా శ్ర‌మించింది. కానీ, చివ‌ర‌కు బొక్క‌బోర్లా ప‌డింది. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభివృద్ధిలో భాగ‌స్వామి అవుతున్నారు. దీంతో కూట‌మిలోని బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు ఒకే పార్టీ నేత‌ల త‌ర‌హాలో గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు క‌లిసి మెలిసి పని చేస్తున్నారు. అయితే, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి టీడీపీ నేత‌లు, ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కొన‌సాగిస్తూనే మంత్రి నారా లోకేశ్ కు కూడా డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత‌లు సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌లు త‌మ అభిప్రాయాన్ని బ‌హిరంగంగానే వ్య‌క్త‌ం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేత‌ల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌న్న డిమాండ్ తీవ్ర‌మైంది. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు తెలుగుదేశం వాద‌న‌ను స‌మ‌ర్ధించ‌గా.. మ‌రికొంద‌రు ఖండించారు. ఇదే అదునుగా తీసుకొని వైసీపీ సోష‌ల్ మీడియా రంగంలోకి దిగింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక వ‌చ్చిందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోప‌క్క‌ లోకేశ్ ను తిట్టిన‌ట్లు జ‌న‌సేన పేరుతో పోస్టులు పెట్ట‌డం, ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తూ తెలుగుదేశం నేత‌ల పేరుతో పోస్టులు పెట్ట‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోష‌ల్ మీడియా పాల్ప‌డింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి అప్ప‌గించాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి డిమాండ్ పెరుగుతుండ‌టంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం విష‌యంపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని అధిష్టానం పార్టీ క్యాడ‌ర్ కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.   

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లోకేశ్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీ బ‌లోపేతంలోనూ లోకేశ్ కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఇటీవ‌లే టీడీపీ స‌భ్య‌త్వాలు తొలిసారి కోటి దాటాయి. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు పార్టీ స‌భ్య‌త్వాలు  తీసుకోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం లోకేశ్ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  కార్య‌క‌ర్త‌ల‌కు అనునిత్యం అందుబాటులో ఉంటూనే మ‌రో ప‌క్క‌ రాష్ట్రం అభివృద్ధిలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని తెలుగుదేశం నేత‌లు కోర‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చొచ్చుకొని వెళ్లొచ్చు.. అదే స‌మ‌యంలో తెలుగుదేశం బ‌లోపేతానికి మ‌రింత‌గా కృషిచేసే అవ‌కాశం ఉంటుంది. అయితే, లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండ‌టంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. జ‌న‌సేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఎవ‌రూ ఈ అంశంపై మాట్లాడొద్ద‌ని సూచించింది. దీంతో గ‌త నాలుగు రోజులుగా కూట‌మిప్ర‌భుత్వంలో చీల‌క తేవాల‌ని ప్ర‌య‌త్నించిన వైసీపీ సోష‌ల్ మీడియా ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. 

గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా చేస్తున్న ఓవ‌రాక్ష‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ శ్రేణులుసైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి పార్టీల మ‌ధ్య చిన్న‌పాటి విబేధాలు రావ‌డం స‌హ‌జ‌మే. అవి టీ క‌ప్పులో తుఫాను లాంటివి. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా వైసీపీ నేత‌లు లోకేశ్ డిప్యూటీ సీఎం విష‌యంపై తెగ హ‌డావుడి చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయాల్సిన వైసీపీ.. కేవ‌లం కూట‌మి పార్టీల మ‌ధ్య విబేధాలు సృష్టించేందుకు, లేనిపోని అస‌త్యాల‌తో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ పెట్టేందుకు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి లోకేశ్ డిప్యూటీ సీఎం ఎపిషోడ్‌లో చివ‌రికి వైసీపీ పెద్ద ఫూల్ అయింద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికైనా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై  ఫోక‌స్ చేస్తారా.. కూట‌మి పార్టీల నేత‌ల మ‌ధ్య ఎప్పుడు విబేధాలు త‌లెత్తుతాయా అని గోతికాడ గుంట‌న‌క్క‌లా ఎదురు చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.