బొత్స, గుడివాడ ఎత్తులు చిత్తు.. వైసీపీ పరువు గల్లంతు

Publish Date:Apr 19, 2025

Advertisement

విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం

అనుకున్నట్టే జరిగింది... విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అయింది. మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ,  గుడివాడ అమర్నాథ్ ఎత్తులు చిత్తయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకపు బీసీ మహిళ బలయ్యారు. సొంత పార్టీ కార్పొరేటర్లే ఎదురుగా తిరగడంతో ఆ పార్టీ పరువు మరోసారి గంగలో కలిసింది. 

విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం శనివారం జరిగింది.  పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య గుర్తింపు అనంతరం కార్పొరేటర్ లను అనుమతించారు ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ కార్పొరేషన్ లో కార్పొరేటర్ల పార్టీ బలాబలాలు మారాయి. నాలుగేళ్ల క్రితం మేయర్ పదవి దక్కించుకున్నప్పుడు వైసిపి బలం 58 కాగా ఇప్పుడు మారిపోయింది జనసేన బలం 11 కి చేరింది ఈ దశలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ద్వారా కూటమి పార్టీలు మేయర్ పదవిని దక్కించుకుంటాయని ముందుగానే అందరూ అంచనాలు వేశారు. కానీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ రాజకీయ ఎత్తులు వేశారు.  ముందుగా శిబిర్యాలను ఏర్పాటు చేసి కార్పొరేటర్ లను శ్రీలంక తరలించారు. కానీ కరుడుగట్టిన వైసిపి కార్పొరేటర్లుగా పేరుందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల వంశీ బెహరా భాస్కరరావు, అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక తదితరులు అవిశ్వాసానికి ముందే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కూటమి చేతుల్లోకి విశాఖ కార్పొరేషన్ రావడం ఖాయమని అందరికీ అర్థమైంది. కానీ విప్ జారీ చేయడం ద్వారా అవిశ్వాసానికి తమ కార్పొరేటర్లు దూరంగా ఉంటారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. మరోవైపు విప్ పాటించినట్లయితే అనర్హత వేటు వేస్తామని మరో మంత్రి బొత్స సత్యనారాయణ బెదిరింపులు, హెచ్చరికలకు దిగారు.  అయితే వీరి హెచ్చరికలను భయపడే స్థాయి నుంచి వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు ఎప్పుడో ఎదిగిపోయారు.

అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని పార్టీ పనులు అన్నీ కూడా ఓ కోటరీ చుట్టూ తిరిగాయనీ,  తిరుగుబాటు కార్పొరేటర్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు.  ఈ దశలో అవిశ్వాస తీర్మా నానికి అనుకూలంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది కూటమి. కూటమికి చెందిన 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు తో పాటు 63 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.  ఇందులో ప్రధానంగా తిప్పల వంశీ ముత్తం శెట్టి ప్రియాంక బెహరా తదితరులు ఉన్నారు. ఒకరకంగా కూటమి పరువును  వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు దక్కించినట్లు అయింది.  ఏడాది కాలంలో ఎప్పుడు కార్పొరేషన్ వైపు రాని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు కూడా కౌన్సిల్ కు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా చెయ్యి ఎత్తారు. 
 
అదలా ఉంటే.. నాలుగేళ్లపాటు మేయర్ గా కొనసాగిన గొలగాని హరి వెంకట కుమారి  అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు.  తొలి  నుంచీ సౌమ్యంగా ఉండే ఆమె పట్ల ఏ పార్టీకీ వ్యతిరేకత లేదు కానీ..  ఒక్కటయ్యారు.  దాదాపు మూడు నెలలుగా అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ పదవి పోతుందని ఊహాగానాలు వినిపించాయి.  ఆ దశలో గొలగాని హరి వెంకట కుమారి పదవికి రాజీనామా చేసి ఉంటే గౌరవంగా ఉండేది.  కానీ వైసీపీ  నాయకులు కులం కార్డు కూడా వినియోగించారు.  బీసీ మహిళ అంటూ నినదించారు.  అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రధానంగా మాజీ మంత్రులు బొత్స సత్యనారా యణ, గుడివాడ అమర్నాథ్ కారణంగానే గోల గాని హరి వెంకట కుమారి ప్రతిష్టకు భంగం కలిగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ముందుగా ఆమె రాజీనామా చేసినట్లయితే ఆమెతో పాటు పార్టీకి గౌరవం దక్కి ఉండేదని విశ్లేషకులు చెప్తున్నారు.  ఏదైనా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు విశాఖ మేయర్ పదవిని బలి ఇచ్చారని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
.
విశాఖ మేయర్ పదవిని చెప్పినట్లే తప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు  డిప్యూటీ మేయర్ లపై దృష్టి పెట్టారు.  అయితే ఇద్దరు డిప్యూటీ మేయర్లలో ముందుగా   శ్రీధర్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో.. మరికొన్ని రోజుల్లోనే  ఆయన నాలుగేళ్ల పదవి కాలం ముగుస్తోంది. దీంతో  ఇప్పటికే  ఆ అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ కు కూటమి నాయకులు నోటీసు ఇచ్చారు.  ఈ దశలో డిప్యూటీ మేయర్ శ్రీధర్,  ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను  చక్రం తిప్పారని చాలా విమర్శలు ఉన్నాయి.  మేయర్ ను ఒక బొమ్మగా చూపించి దోచుకున్నారని.  అందుకే ఆ నాయకులను టార్గెట్ చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే జియాని శ్రీధర్ ఆస్తుల వివరాలపై ఒక వీడియోను కూడా కూటమి నాయకులు విడుదల చేశారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన బాణాల శ్రీను, జియ్యాని శ్రీధర్, మోల్లి లక్ష్మి అప్పారావు, పారిశ్రామిక వాడకు చెందిన సురేష్ తదితరుల పై ఇప్పుడు కూటమి టార్గెట్ పెట్టింది.  త్వరలోనే డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

 అదలా ఉంటే.. పెందుర్తి ప్రాంత కార్పొరేటర్ టిడిపి సీనియర్ నాయకుడు పీలా శ్రీనివాస్ ఇక విశాఖ నగర మేయర్ అయినట్టే.  కూటమి కార్పొరేటర్ల శిబిరాల ఏర్పాటు.. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్ల  ఫిరాయింపు వ్యవహారంలో అన్ని రకాల వ్యవహారాలను పీలా శ్రీనివాస్ తన భుజంపై వేసుకున్నారు.  కేవలం 10 నెలల కాలపరిమితి ఉన్న ఈ మేయర్ పీఠం కోసం ఎందుకని చాలామంది కూటమి నాయకులు వెనుకడుగు వేసినా..  పీలా కుటుంబం వైసీపీ హయాంలో తమకు జరిగిన నష్టాన్ని ఈ రకంగా తీర్చుకో వాలని నిర్ణయించారు.  పీల శ్రీనివాస్ సోదరుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే ఆస్తులను  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో   ధ్వంసం చేసిన ఘటనలను కూటమి నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  సీతంపేటలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ భవనాన్ని కూల్చివేయడం ఆనందపురం మండలం రామవరం వద్ద వారి కుటుంబానికి చెందిన భూములను తీసుకోవడానికి వైసిపి హయాంలో జరిగిన వ్యవహారాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ దశలో త్వరలో జరిగే సమావేశం ద్వారా కూటమి నాయకులు పీలా శ్రీనివాస్ ను మేయర్ గా ఎన్నుకునే అవకాశాలు దాదాపు ఖరారు అయినట్టే.

 అయితే విశాఖలో వైసీపీ పరువు పోవడానికి బోత్స, గుడివాడల అనవసర రాజకీయాలే కారణమని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు తమతమ పదవులకు రాజీనామా చేశారు.  ఇక్కడ కూడా అదే రకంగా గొలగాని హరి వెంకట కుమారి రాజీనామా చేసినట్లయితే పార్టీ పరువు నిలిచి ఉండేది.  కానీ బొత్స గుడివాడ అనాలోచిత నిర్ణయాల వలన పార్టీ పరువు బజారు పాలు అయిందని వైపీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.  

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.