Publish Date:Aug 13, 2025
కంచుకోట అనుకున్న పులివెందుల పేకమేడ అని తేలిపోయిందా? వైసీపీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఫలితాల వెల్లడికి ముందు.. కాదు కాదు పోలింగ్ కు ముందే కాడి వదిలేసిందా? అడలేక మద్దెలు ఓడు అన్న చందంగా పులివెందులలో తమ పరిస్థితికి పోలీసులే కారణం అంటోందా? అంటే వైసీపీ నేతల వ్యాఖ్యలు, హెచ్చరికలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు.
మూడు దశాబ్బాలకు పైగా జడ్పీటీ స్థానానికి ఎన్నిక అంటే ఏమిటో తెలియని పులివెందుల జనాలకు ఇప్పుడు తోలిసారిగా ఓటు వేస్తున్నామన్న ఆనందం కలిగింది. అదే సమయంలో పటిష్ట బందోబస్తుమధ్య ఎన్నికల నిర్వహణతో వైసీపీయులకు రిగ్గింగ్ కు అవకాశం లేకుండా పోయింది. ఇదే వారి ఆగ్రహానికి కారణమైంది. మా అడ్డాలో ప్రజాస్వామ్యం ఏమిటి? అంటూ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాకీ మీ ఉద్యోగాలు తీసేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడపీకుతాం..అంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అయితే వాస్తవంలో పోలీసులు తెలుగుదేశం, వైసీపీ నేతల పట్ల సమంగానే వ్యవహరించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు పార్టీలకు చెందిన నేతలను ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అయినా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వందల మందితో ప్రదర్శనలు నిర్వహించారు. పోలింగ్ బూతులలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగా లుండవు జాగ్రత్త అంటూ హెచ్చరికలకు దిగుతున్నారు. మొత్తం మీద పులివెందులలో వైసీపీది బలం కాదు, వాపు మాత్రమేనని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రుజువు చేసిందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-lost-grip-in-pulivendula-25-204103.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.