వైైసీపీ స్వరం మారింది.. ధీమా పోయింది!

Publish Date:May 15, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా తమ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు, ఎన్నికల ఉల్లంఘనలను చూసీ చూడనట్ల వదిలేసిన ఎన్నికల సంఘం కూడా చంద్రబాబుతో కుమ్మక్కైపోయారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

పోలింగ్ జరిగిన సోమవారం (మే 13) సాయంత్రం కూడా ప్రభుత్వ సలహాదారు, పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గంభీరంగానే మాట్లాడారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారని ధీమాగా చెప్పారు. వెల్లువెత్తిన ఓటరు చైతన్యం జగన్ సంక్షేమ పాలనకు అనుకూలంగానే ఉందని చెప్పుకున్నారు. సాక్షాత్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ సైతం తనకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేసిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాలకు కృతజ్ణతలు చెప్పారు. కానీ మంగళవారం (మే14) ఉదయానికల్లా వీళ్ల స్వరం మారిపోయింది. ధీమా మాయమైపోయింది. బేలతనం బయటపడిపోయింది. తమ కోసం ఐదేళ్లు ఉద్యోగ ధర్మాన్ని కూడా విస్మరించి సేవలు చేసిన పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారనీ, తమ కాళ్లూ చేతులూ కట్టేశారంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టారు.

ఇలా ఆరోపణలు గుప్పించి, తమ ఓటమికి సాకు వెతుక్కోవడంలో వైసీపీ నాయకులు, అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీలు పడ్డారు.  తెలుగుదేశం పెద్ద ఎత్తున రిగ్గింగుకు పాల్పడిందని ఆరోపణలు గుప్పించారు. అధికార పార్టీ ప్రతినిథులుగా తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం లెక్క చేయలేదనీ, పట్టించుకోలేదనీ విమర్శలు గుప్పించారు. మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ అభ్యర్థులు ఇలా వీళ్లూ వాళ్లూ అని లేదు వైసీపీ ముఖ్య నేతలంతా ఎన్నికల సంఘం, పోలీసులు, అధికారులపై విమర్శల పర్వానికి దిగి పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించేశారు.

అలా పరోక్షంగా ఓటమిని అంగీకరించిన ప్రముఖుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి, నరసరావు పేట లోక్ సభ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్, గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి ఉన్నారు. తెలుగుదేశం శ్రేణులు తమపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు తప్ప నియంత్రించడానికి, ఆపడానికీ వీసమెత్తు ప్రయత్నం చేయలేదని వీరు ఆరోపించారు.  ఇక అనీల్ కుమార్ యాదవ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పోలీసులను, ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మేనేజ్ చేశారని ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు.  
ఇక నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా పోలీసులు తెలుగుదేశం పార్టీ తరఫున పని చేశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

సరిగ్గా  వారీ ఆరోపణలు చేస్తున్న సమయంలోనే గ్రామాలలో వైసీపీ మూకలు తెలుగుదేశం శ్రేణులు, సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతలలలో గెలుపు ధీమా పోయి, ఉక్రోషంతో  ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఆయన చేసిన హత్యలు, అన్ని వర్గాల వారి మీద చేసిన దాడులు, కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు... వీటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. పిన్నెల్లి బాహాటంగా చేసిన ఘోరాలలో కొన్నిటిని మాత్రమే ఈ పుస్తకంలో పబ్లిష్ చేశారు.
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, శాపనార్ధాలు సహజం. అయితే ఓటమి భయం తలకెక్కిన పార్టీ నేతలు మాత్రం ఆ విమర్శలు, తిట్లను సానుభూతిగా మార్చుకునేందుకు ప్రయత్నించడం కద్దు. అయితే ఆ ప్రయత్నంలో తాము ప్రత్యర్థులపై చేసిన విమర్శలను కన్వీనియెంట్ గా మరిచి పోతారు. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ఆకాశాన్నంటిటే పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే అవినీతిని పాతాళంలో తొక్కేయడానికి పావులు కదుపుతోంది.
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం బుధవారం (మే 29) ఉదయం సీఎం చంద్రబాబు అన్న నినాదాలతో మారుమోగిపోయింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతం ఇప్పటికే దిగజారిన ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది.
వారం రోజులు.. సరిగ్గా వారం రోజులు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలిపోతుంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో వెడుతోంది. తన తప్పులు, తప్పిదాలు, తన దౌర్జన్యాలూ, దాష్టికాలూ అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత ఐదేళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయ్యింది.
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మే 29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-7
ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది.
వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.