ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రతిష్ట మసకబారింది. ఆ పార్టీకి గట్టి పట్టున్న రాయలసీమలో సైతం ఇటీవలి ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అయితే కొద్దిగా దెబ్బతిన్నా కడప జిల్లాలో మాత్రం ఏదో పరువు దక్కింది అనిపించుకోగలిగింది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టు నిలుపుకున్నా.. ఆయన సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం గత పదేళ్లుగా ప్రతినిథ్యం వహిస్తూ వస్తున్న కమలాపరంలో పట్టు కోల్పోయారు. ఘోర పరాజయం పాలయ్యారు.
అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కడప జిల్లాలో వైసీపీ ప్రభ వేగంగా మసక బారిపోతోంది. జిల్లాలోని మునిసిపాలిటీలు ఒకదాని వెంట ఒకటిగా వైసీపీ చేజారుతున్నాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట.. ఇలా అన్ని మునిసిపాలిటీల్లోనూ అదే పరిస్థితి కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. క్యాడర్ సంగతి సరే సరి వారెప్పుడో పార్టీకి దూరం అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్ మేనమాప పదేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన కమలాపురం మునిసిపాలిటీ కూడా చేజారిపోతోంది. ఇలా జిల్లాలో ఒక్కటంటే ఒక్క మునిసిపాలిటీ కూడా వైసీపీకి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది.
చివరాఖరికి కడప కార్పొరేషన్ లోనూ అదే పరిస్థితి. అంతేందుకు పులివెందుల మునిసిపల్ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం తలుపుతడుతున్న పరిస్థితి. అయితే తెలుగుదేశం నుంచి వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనీ, అందుకే పులివెందులలో ప్రస్తుతానికి వైసీపీ సేఫ్ గా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కమలాపురం మునిసిపల్ చైర్మన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి చేరికతో కమలాపురం మునిసిపాలిటీలో వైసీపీ మైనారిటీ అయిపోయింది. గతంలోనే పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజా చేరికలతో కమలాపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం మెజారిటీ లో ఉంది. దీంతో కమలాపురం మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైనట్లే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-loosing-grip-in-kadapa-jilla-39-186461.html
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.