కడపలో వైసీపీ పట్టు జారిపోయింది!?

Publish Date:Dec 27, 2024

Advertisement

కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు  చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది. 

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కడపలో వైసీపీ అరాచకాలకు కళ్లెం వేడాయినిక కృత నిశ్చయంతో ఉంది. ఎవరైనా సరే చట్టాలను, నిబంధనలను గౌరవించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. తోక జాడిస్తే ఆ తోకను కట్ చేయడానికి రెడీ అని హెచ్చరికలు జారీ చేస్తోంది. కడప గడ్డపై నుంచే వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెడతామనీ, మెడలు వంచుతామని హెచ్చరికలు జారీ చేయడానికి రెడీ అవుతోంది. గాలీవీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి, పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమౌతోంది.  ఇందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుంబిగించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఇక చట్టాన్ని అతిక్రమించే వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడానికి ఆయన కడప పర్యటనకు సమాయత్తమౌతున్నారు.  

ఇంత కాలం ఉమ్మడి కడప జిల్లాలను వైసీపీ నేతలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను భయపెట్టి తమ దారికి తెచ్చుకునేవారు. వారు దారికి రాకుంటే ఫ్యాక్షనిస్టు మార్గాలలో కుటుంబాలను టార్గెట్ చేసుకుని బెదరింపులకు పాల్పడేవారు. దీంతో అధికారులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సేఫ్ గేమ్ ఆడేవారు. దీంతో ఇంత కాలం కడపలో వైసీపీ రాజ్యాంగమే నడుస్తూ వచ్చింది. వైసీపీ రాజ్యాంగమంటే రాజారెడ్డి రాజ్యాంగమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై ఇలాంటి పోకడలు సహించేది లేదన్న సంకేతాన్ని కూటమి ప్రభుత్వం గాలివీడు ఎంపీడీవోపై దాడి సంఘటన తరువాత  ఆ దాడికి పాల్పడిన వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడ్ని చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కుని పోవడం  ద్వారా కూటమి సర్కార్ ఇచ్చింది. పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఇక వైసీపీయుల అరాచకాలకు కళ్లెం వేస్తామని స్పష్టం చేసింది.

అధికారులు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా తమ పని తాము చేస్తే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చాటడం ద్వారా కూటమి సర్కార్ వైసీపీయుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇక ప్రభుత్వాధికారులకు నైతిక భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటించి అధికారులు, ప్రజలలలో ధైర్యాన్ని నింపడానికి సమాయత్తమౌతున్నారు. ఇప్పటకే జిల్లా జనం, వైసీపీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు. ఆ విషయం ఇటీవల క  జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. సొంత పార్టీ క్యాడరే అధినేత జగన్ పట్ల అసంతృప్తి, అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. జగన్ వ్యవహార శైలి పట్ల తమ వ్యతిరేకతను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కడప గడ్డపై నుంచి వైసీపీ అరాచకాలను సహించేది లేదని చాటేందుకు రెడీ అవడంతో  ఇక వైసీపీయులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.