జగనన్నా..జనంలోకి రాకన్నా!

Publish Date:Feb 21, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి సొంత పార్టీ నుంచే విజ్ణప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ జనంలోకి రాకుండా ఉంటేనే పార్టీ ఆబోరు కొంచమైనా దక్కుతుందన్నది వైసీపీ శ్రేణులు, నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకో జగన్ జనంలోకి వస్తానంటే వద్దు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. జగనన్నా.. జనంలోకి రావద్దన్నా.. అంటే విజ్ణప్తులు చేస్తున్నారు. వైసీపీ నేతలు, క్యాడర్ ఒత్తిడి కారణంగానే జగన్ తన జిల్లాల పర్యటన వాయిదా వేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
జగన్ రాజకీయ అరంగేట్రం చేసి 15 సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ ఆయన రాజకీయ నేతగా కాకుండా, ఒక ఫ్యాక్టనిస్టుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

అధికారంలో ఉన్న ఐదేళ్లూ జనానికి ముఖం చూపకుండా, జనం ముఖం చూడకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై పాలన సాగించిన జగన్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరవాత జనంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే ఆయన బయటకు వస్తున్నారంటే జనాలను సమీకరించడం ఎలా అన్న భయంతో వణికి పోతున్నామనీ వైసీపీ లీడర్లే చెబుతున్నారు.  అధికారంలో ఉండగా నిత్యం తెలుగుదేశం, జనసేన నేతలూ, క్యాడర్ లపై వేధింపులు, తప్పుడు కేసులు అంటూ కక్ష సాధింపు చర్యలతో గడిపేసిన జగన్ ఎన్నడూ రాష్ట్ర ప్రగతి గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. బటన్ లు నొక్కుతున్నాను కదా?  లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు పడుతున్నాయి కదా?  అది చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉంది. 
ఇక సీఎంగా తన ఐదేళ్ల పదవీ కాలంలో ఆయన ఎన్నడూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ప్రెస్ నోట్లు పంపడం, లేదా మీడియా ముందుకు సకలశాఖల మంత్రి సజ్జలను పంపి తన మాట ఆయన నోట వినండి అన్నట్లుగా వ్యవహరించడంతోనే సరిపెట్టేశారు. 
2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి కర్తాకర్మాక్రియా తానేనని జగన్ బాహాటంగానే చెప్పుకున్నారు. అదే విధంగా 2024 ఎన్నికలలో కూడా తన ముఖారవిందమే చాలు జనం ఓట్లు వేయడానికి అన్నట్లుగానే వ్యవహరించారు. ఇష్టారీతిగా అభ్యర్థులను మార్చేశారు. 

సరే అదంతా పక్కన పెడితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 175 స్థానాలలో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలలోనే విజయం సాధించింది. గెలుపునకు కర్తా, కర్మా, క్రియా అన్నీ తానేనని జగన్ ఎలా జభావించారో, ఓటమికి కూడా తానే కారణమని జగన్ భావించి ఉంటే.. పార్టీ పరాజయానికి కారణాలపై, అధికారంలో ఉండగా తాను చేసిన తప్పులపై సమీక్ష చేసుకునే వారు, ఆత్మ  విమర్శ చేసుకుని, పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టేవారు. అయితే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే పరాజయం పాలయ్యామనీ,  సింహంలా సింగిల్ గా వారడం వల్లే కూటమి విజయం సాధ్యమైందనీ, బటన్లు నొక్కి తాను పంచిన సొమ్ములు తీసుకున్న జనం ఓటు వేయకుండా మోసం చేశారనీ కారణాలు చెబుతూ.. ఇప్పటికీ తాను సుద్దపూసనేననీ, జనం తమ తప్పు తెలుసుకుని మళ్లీ తనను సీఎంను చేస్తారనీ భ్రమల్లోనే ఉన్నారు. పార్టీ నేతలూ, క్యాడర్ ను కూడా అలాగే భ్రమల్లో బతకమంటున్నారు. 

ఇలా భ్రమల్లో ఉంటూ.. గతంలో వ్యవహరించిన తీరునే జగన్ వ్యవహారశైలి ఉండటం వల్ల వైసీపీకి తప్ప మరెవరికీ ఎటువంటి నష్టం లేదు.  ఆ విషయం స్పష్టంగా తెలుసు కనుక.. వైసీపీ నేతలూ, శ్రేణులూ జగనన్నా జనంలోకి రావద్దన్నా, తాడేపల్లి ప్యాలెస్ కో, బెంగళూరు ప్యాలెస్ కో పరమితమైతే చాలన్నా అంటూ బతిమలాడుతున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చియార్డు సందర్శన చేసిన జగన్  తనకు భద్రత కల్పించలేదంటూ చేసిన విమర్శలపై పార్టీ వర్గాలలోనే అసహనం వ్యక్తం అవుతోంది. ఇక వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లిన జగన్ ఆ సందర్భంగా చేసిన ప్రసంగం సొంత పార్టీ నేతలే తలలు బాదుకునేలా ఉంది. 

అమ్మ ఒడి అందడం లేదంటూ ఓ  చిన్నారి చేత మాట్లాడించి పండిద్దామనుకున్న డ్రామా కూడా బూమరాంగ్ అయ్యింది.  జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల లబ్ధిదారులమంటూ ఆ చిన్నారి చేసిన వ్యాఖ్యలు జగన్ ను నవ్వుల పాలు చేశాయి. అందుకే ఇక చాలు జగనన్నా.. మరింత పలుచన కావద్దు.. ప్యాలెస్ లోనే కాలం గడుపు అంటూ వైసీపీ క్యాడర్ ఆయనను వేడుకుంటోంది. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.