ముంబై హీరోయిన్‌కి వైసీపీ నేత చిత్రహింసలు!

Publish Date:Aug 26, 2024

Advertisement

అధికారంలో వున్నా, అధికారం పోయినా వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, లీలలు మాత్రం నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. ఇంతకాలం వైసీపీ నాయకులు తమ తెలివితేటలను లోకల్‌గానే చూపిస్తున్నారని అనుకుంటున్నాం. వీళ్ళ తెలివితేటలు సరిహద్దులు దాటి.. రాష్ట్రాలు దాటి ముంబై వరకు చేరుకున్నాయి. ముంబైకి చెందిన ఆషా జెత్వానీ అనే హీరోయిన్‌ని, ఆమె తల్లిదండ్రులని, బంధువులని ఒక హీరోయిన్‌ని వైసీపీలో బాగా పలుకుబడి వున్న నాయకులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, తప్పుడు కేసులో ఇరికించి జైలుపాలు చేసిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అనగనగా ఆషా జెత్వానీ అనే ఒక ముంబై హీరోయిన్. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. పెద్దగా సక్సెల్ ఏమీ రాలేదు. ఆ తర్వాత ముంబైకి వెళ్ళిపోయింది. సినిమా హీరోయిన్ వేషాల మీద ఆశలు వదులుకుని, టీవీ సీరియళ్ళలో పాత్రలు ధరిస్తోంది. ఆమె టాలీవుడ్‌ సినిమాల్లో నటించినప్పుడు ఏపీకి చెందిన ఒక పెద్ద పోస్టు వెలగబెట్టిన వైసీపీ నాయకుడితో పరిచయం కలిగింది. ఆ పరిచయం చాలా దూరమే వెళ్ళిందన్న అభిప్రాయాలున్నాయి. పెద్ద గోకుడు మాస్టర్‌గా పేరున్న ఆ వైపీ బడా లీడర్, ఆ  హీరోయిన్ మధ్య ఏం జరిగిందో ఊహించలేని అమాయకులు ఎవరూ లేరు. కొంతకాలం హైదరాబాద్‌లో వేషాల కోసం ప్రయత్నించిన ఆమె ముంబైకి వెళ్ళిపోయింది. తనకు, తెలుగు రాష్ట్రాలకు ఇక సంబంధం లేదు అని ఆమె భావిస్తున్న తరుణంలో, ఏపీకి చెందిన ఆ వైసీపీ నాయకుడు ఆమె జీవితంలోకి మళ్ళీ ప్రవేశించాడు. 2024లో రాష్ట్రంలో జగన్ పార్టీ అధికారంలో వున్న సమయంలో తన అధికార బలంతో, అధికార మదంతో సదరు హీరోయిన్ జీవితంలో ఆడుకున్నాడు. పోలీసుల సహకారంతో ఆ హీరోయిన్‌ని చిత్రహింసలకు గురిచేశారు.

జగన్ హయాంలో ఆయన చెప్పినట్టల్లా ఆడి, జగన్ అరాచక పాలనకు తనవంతు సహాకారం అందించిన ఒక ఐపీఎస్ అధికారి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏ పోస్టులోనూ నియమించకపోవడంతో ఖాళీగా వున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అ గొప్ప ఐపీఎస్ ఆఫీసర్, సీఐగా వెలగబెట్టిన ఒక అధికారి సహకారంతో సదరు వైసీపీ పెద్దమనిషి ముంబై హీరోయిన్‌ని చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. సదరు వైసీపీ నేత ఆ హీరోయిన్ మీద తప్పుడు కేసు పెట్టాడు. దీనికోసం మొవ్వ మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్‌ని పావుగా వాడుకున్నారు. తమను హీరోయిన్ మోసం చేసిందంటూ తప్పుడు కేసు పెట్టించారు. ఐపీఎస్ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా కమిషరేట్ కార్యాలయం నుంచి టాస్క్ ఫోర్స్ టీమ్ ముంబైకి వెళ్ళింది. ఆషా జెత్వానీని, ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసి 2024 ఫిబ్రవరిలో విజయవాడకి తీసుకొచ్చింది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఒక ప్రదేశంలో హీరోయిన్‌ని, ఆమె కుటుంబాన్ని రెండు వారాలపాటు నిర్బంధించింది. అక్కడ ఆమెని పోలీసులు శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. అక్రమ కేసులో అరెస్టు చేసి సబ్ జైలుకు పంపారు. ఈ వార్త మీడియాకి తెలియకుండా అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ దారుణం బయటకి వచ్చింది. 

ఇబ్రహీంపట్నంలో ఉండని వ్యక్తి, ఎక్కడో కృష్ణా జిల్లా ప్రాంతంలో మొవ్వ మండలంలో ఉండే వ్యక్తి ఫిర్యాదుతో ఈ హీరోయిన్‌ని, ఆమె కుటుంబాన్ని పోలీసులు ముంబైకి వెళ్ళి మరీ ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? ఒకప్పుడు ఆ హీరోయిన్‌తో సన్నిహితంగా వున్న ఆ వైసీపీ నాయకుడు ఆమెను చిత్ర హింసలకు ఎందుకు గురిచేయించాడు? ఎందుకు జైలుకు పంపించాడు.. ఇప్పుడు ఇవన్నీ రహస్యాలుగా వున్నాయి. ఈ రహస్యాలను ఛేదించే ప్రాసెస్ కూడా జరుగుతోంది. త్వరలో దీనికి సబంధించిన అన్ని వివరాలూ అధికారంగా బయటకు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.